Begin typing your search above and press return to search.

#RRR.. ఒక ఇంట్రెస్టింగ్ టాక్

By:  Tupaki Desk   |   1 Jun 2018 5:23 AM GMT
#RRR.. ఒక ఇంట్రెస్టింగ్ టాక్
X
టాలీవుడ్ పై ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో ఉన్న మీడియా చానెళ్లు ఓ కన్నేసి ఉంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బహుబలి తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు రాజమౌళి నెక్స్ట్ ఎలాంటి మాయాజాలం తో రాబోతున్నాడో అనే విషయం పై ఆసక్తి చూపుతున్నారు. ఆ ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న విషయం లీకైనా కోలీవుడ్ బాలీవుడ్ లో ట్రెండ్ అవుతోంది.

ఇక రాజమౌళి నెక్స్ట్ సినిమా మల్టీస్టారర్ అని అందరికి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారకరామారావు ఆ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు. యాక్షన్ సీన్సే ప్రధానంగా దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇకపోతే ఈ #RRR ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. సినిమాలో చరణ్ - ఎన్టీఆర్ బ్రదర్స్ గా కనిపించనున్నట్లు మొదటి నుంచి టాక్ వస్తోంది.

అయితే అందులో వారి పాత్రలు ఒకదానికి మరొకటి సంబందం లేకుండా రాజమౌళి సెట్ చేసుకుంటున్నాడు. తారక్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తే.. రామ్ చరణ్ ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో వీరికి సంబంధించిన సీక్వెన్స్ హైలెట్ అని టాక్ వస్తోంది. అలాగే కథలో భాగంగా దర్శకుడు గ్రాఫిక్స్ కూడా గట్టిగానే వాడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండింగ్ కు వచ్చేశాయి. ఇక సినిమా బడ్జెట్ లెక్కేసుకుంటే 300 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. డివివి దానయ్య సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.