Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో: స్కూటర్ పై తారక్ చరణ్!
By: Tupaki Desk | 2 April 2019 10:52 AM GMTరాజామౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టిస్టారర్ చిత్రం 'RRR' షూటింగ్ ప్రస్తుతం వడోదరలో జరుగుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వడోదర కు వెళ్తున్నామని ఒక లాంగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని వెల్లడించాడు. ఇక తాజాగా RRR షూటింగ్ లొకేషన్ నుండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు వచ్చింది.
షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లో చరణ్ ఒక స్కూటర్ పై కూర్చుని వేచి చూస్తూ ఉన్నాడు. అప్పుడే బస్ నుంచి దిగిన తారక్ ను డ్రైవ్ చేయమంటూ స్కూటర్ వెనక్కు జరిగి డ్రైవింగ్ సీట్ తారక్ కు ఇచ్చాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఎన్టీఆర్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. లాల్చీ.. పైజమాలో తారక్ కనిపించగా చరణ్ మాత్రం ప్యాంట్ షర్ట్ లోకనిపించాడు. ఈ విడియో సోషల్ మీడియాలోకి రావడంతో వెంటనే వైరల్ అయింది. చరణ్ ఫ్యాన్స్.. తారక్ ఫ్యాన్స్ అందరూ ఈ విడియోను షేర్ చేస్తూ.. లైకులతో హోరెత్తిస్తున్నారు.
ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.. తారక్ కు జోడీగా డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.