Begin typing your search above and press return to search.
షూటింగ్ లేకున్నా తారక్.. చరణ్ కష్టపడుతూనే ఉన్నారట
By: Tupaki Desk | 30 May 2020 5:30 AM GMTరాజమౌళి తన సినిమాలోని ప్రతి ఎలిమెంట్ విషయంలో ఎంతో జాగ్రత్త పడతాడు. అలాంటిది హీరోల విషయంలో మరెంతగా జాగ్రత్తలు పాటిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటిస్తున్న ఇద్దరు హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి పాత్రల డిజైన్ ను నభూతో నభవిష్యతి అన్నట్లుగా జక్కన్న తీర్చి దిద్దినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి కాస్ట్యూమ్స్ నుండి మొదలుకుని వారి బరువు వరకు అన్ని విషయాలను కూడా ప్రతి రోజు చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ షూట్ చేస్తూ ఉంటాడు.
గత రెండు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో హీరోలు ఇద్దరు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా బరువు పెరగకూడదని ముందే రాజమౌళి వారికి సూచించారట. షూటింగ్స్ లేకున్నా కూడా ఇద్దరు హీరోలు ప్రతి రోజు కనీసం రెండు నుండి మూడు గంటల వరకు వర్కౌట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బరువు తగ్గకుండా మరియు పెరగకుండా ఇద్దరు హీరోలు కూడా చాలా కష్టపడి మరీ డైట్ ను ఫాలో అవుతున్నారట.
ప్రభుత్వం అనుమతులు వచ్చిన వెంటనే తక్కువ మంది టెక్నీషియన్స్ మరియు నటీనటులతో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా షూటింగ్ గత రెండు నెలలుగా జరగని కారణంగా వాయిదా వేసే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.