Begin typing your search above and press return to search.
పవన్ వర్సెస్ చెర్రీ.. పొంగల్ ఫైట్??
By: Tupaki Desk | 18 April 2016 5:30 PM GMTటాలీవుడ్ లో ఇంకా సమ్మర్ రేస్ పూర్తి కాలేదు. అప్పుడే వచ్చే ఏడాది పొంగల్ కి పోటీ మొదలైపోయింది. మధ్యలో దసరా, దీపావళి లాంటి సీజన్ లు ఉన్నా.. హీరోలందరూ సంక్రాంతినే టార్గెట్ చేసి సినిమాలు ప్లాన్ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు మెగా హీరోలు పొంగల్ రేసులో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రామ్ చరణ్.. మొదట పొంగల్ రేస్ లోకి వచ్చాడు. ప్రస్తుతం నటిస్తున్న తని ఒరువన్ చిత్రాన్ని ఆగస్ట్ రిలీజ్ కు ప్లాన్ చేసిన రామ్ చరణ్.. తర్వాతి సినిమాని సంక్రాంతికే షెడ్యూల్ చేశాడు. జూన్ చివర్లో సుకుమార్ తో సినిమాని స్టార్ట్ చేసేసి.. సంక్రాంతి నాటికి విడుదల చేసేయాలన్నది సుక్కు-చెర్రీల ఆలోచన. ఈ మేరకు షెడ్యూల్స్ కూడా ఫైనలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడీ రేసులోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఇచ్చిన షాక్ తో.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కి స్పీడ్ పెంచాడు పవన్.
సర్దార్ తో నష్టపోయిన వారిని ఆదుకునేందుకుగాను.. ఎస్ జే సూర్యతో చేయనున్న సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్. ఇందుకోసం సంక్రాంతి సీజన్ నే సెలక్ట్ చేసుకున్నాడు కూడా. మరి 2016 సంక్రాంతి సీజన్ నందమూరి హీరోల మధ్య పోటీతో నడిచినట్లుగా.. 2017 సంక్రాంతి సీజన్ మెగా హీరోల కాంపిటీషన్ ఉంటుందా అనుకుంటున్నారు సినీ జనాలు.