Begin typing your search above and press return to search.
సమ్మర్ లో కశ్మీర్ చెక్కేస్తున్న చెర్రీ, రకుల్..
By: Tupaki Desk | 29 April 2016 11:30 AM GMTరామ్ చరణ్.. ఎట్టకేలకు తన కొత్త సినిమా షూటింగ్ లో భాగం అవుతున్నాడు. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న మూవీకి.. నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మే 11 నుంచి కశ్మీర్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకోనుంది. సమ్మర్ లో కశ్మీర్ అందాలు మరింతగా గుభాళిస్తాయి. మంచు కరుగుతూ మరింత అందంగా మెరిసిపోవడం ఆ ప్రాంతం స్పెషాలిటీ.
అందుకే సమ్మర్ లో కశ్మీర్ అందాల్లో.. రామ్ చరణ్ - రకుల్ ప్రీత్ లతో పాటలు ప్లాన్ చేశాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ప్రధాన సన్నివేశాలను కూడా కశ్మీర్ లోనే తెరకెక్కించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు మొత్తం యూనిట్ అంతా కశ్మీర్ లోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది. మే నెలాఖరు నాటికి హైద్రాబాద్ చేరుకుని.. షూటింగ్ కంప్లీట్ చేయననున్నారని సమాచారం. ఈ మూవీకి ధృవ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తునండగా.. హిప్ హాప్ తమీజా ద్వయం సంగీతం అందిస్తున్నారు.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ధృవ ను నిర్మిస్తుండగా.. శరవేగంగా ఈ మూవీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. మొదట ఈ చిత్రాన్ని ఆగస్ట్ నాటికి ఫినిష్ చేయాలని అనుకున్నా.. ప్రస్తుతం ఆ అవకాశం కనిపించడం లేదు. అయితే.. దసరా నాటికి మాత్రం ధృవ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.