Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ కి ముందు రామ్..
By: Tupaki Desk | 14 July 2016 6:10 AM GMTరామ్ చరణ్ టార్గెట్ దసరా సీజన్. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చెర్రీ.. శరవేగంగా షూటింగ్ చేసేస్తున్నాడు. జూన్ స్టార్టింగ్ లో ధృవ షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ కాగా.. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా పిక్చరైజ్ చేస్తూనే ఉన్నారు. వరుసగా షెడ్యూల్స్ ప్లాన్ చేయడం.. చకచకా చిత్రీకరణ జరిపేయడం అంతా దసరా టార్గెట్ ని అందుకోవడానికే.
అక్టోబర్ 7న ధృవని రిలీజ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. గతేడాది కూడా దసరా సీజన్ లో బ్రూస్ లీ తో వచ్చిన చరణ్.. సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చినా సెలవల సీజన్ కారణంగా కలెక్షన్స్ బాగానే దక్కించుకున్నాడు. ఇప్పుడు తని ఒరువన్ లాంటి బ్లాక్ బస్టర్ రీమేక్ తో.. తన సత్తా చాటాలన్నది చరణ్ ఆలోచన. అయితే.. ఈసారి చరణ్ కి ఓ వారం ముందు ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా రానుంది. హైపర్ అనే టైటిల్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీని.. సెప్టెంబర్ 30న విడుదల చేసేలా ప్లాన్ చేశారు.
రామ్ ఎంట్రీతో చరణ్ కి పోటీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. అయితే.. గతేడాది కూడా బ్రూస్ లీకి ఓ వారం ముందు అనుష్క - అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రమదేవి వచ్చింది. రుద్రమదేవి 50 కోట్లు.. బ్రూస్ లీ 40 కోట్ల మార్క్ ను ఈజీగా దాటేశాయి. ఇప్పుడు రామ్ హైపర్ ఓ వారం రిలీజ్ అయినా.. దసరా లాంటి సీజన్ లో రెండూ ఫేర్ చేయడం పెద్ద కష్టమేం కాదని చెప్పచ్చు. మూవీలో కంటెంట్ ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి ఓ సారి చూశాం కదా.