Begin typing your search above and press return to search.
చరణ్-వైట్ల.. టెంపర్ అయ్యేట్లుందిగా!
By: Tupaki Desk | 1 July 2015 7:17 AM GMTముందే రిలీజ్ డేట్ ఇచ్చి కచ్చితంగా ఆ డేటుకల్లా సినిమాను రిలీజ్ చెయ్యడం బాలీవుడ్ వాళ్లకే చెల్లింది. ఐతే వాళ్లేమీ హడావుడిగా రిలీజ్ డేట్ ఇచ్చేయరు. రిలీజ్ డేట్‌కు ఇంకా ఏడాదో రెండేళ్లో ఉంటుంది. మధ్యలో షూటింగ్ విషయంలో ఏవైనా ఇబ్బందులొచ్చినా పర్లేదు. ఇలా ఏడాదో.. ఏడాదిన్నర ముందో రిలీజ్ డేట్ ఇస్తే మనవాళ్లు కూడా ఆ ప్లానింగ్‌ను ఫాలో అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఆర్నెల్ల ముందు డేటిస్తారు. ఈ మధ్యలో షూటింగ్‌లో కొంచెం కిందా మీదా అయ్యిందంటే అంతే సంగతులు. రిలీజ్ డేట్ మారిపోతుంటుంది.
గత ఏడాది టెంపర్ సినిమా విషయంలో ఇలాగే జరిగింది. ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టిందే ఆగస్టులో. జనవరి 9న సినిమా విడుదల అని ఘనంగా ప్రకటించేశారు. మధ్యలో ఏవో ఇబ్బందులతో షూటింగ్ రెండు మూడుసార్లు వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఎంత కష్టపడ్డా.. రేయింబవళ్లు పని చేసినా.. రిలీజ్ డేట్‌ను అందుకోలేకపోయారు. చివరికి అనుకున్న దానికంటే నెల ఆలస్యంగా రిలీజైంది టెంపర్. ఇప్పుడు రామ్‌చరణ్, శ్రీను వైట్ల సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉందంటున్నారు సినీ జనాలు. ఈ సినిమా షూటింగ్ మొదలైందే ఏప్రిల్‌లో.
ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి అక్టోబరు 15న సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. షూటింగ్ ప్రణాళిక ప్రకారమే సాగుతున్నప్పటికీ.. రిలీజ్ డేట్ అందుకుంటామా లేదా అని ఇప్పుడు డౌట్ వచేస్తోందంట శ్రీను వైట్ల అండ్ టీమ్‌కి. మిగతా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా.. పోస్ట్ ప్రొడక్షన్ ఏ ఇబ్బందులూ లేకుండా సాగిపోతుందా.. రిలీజ్ డేట్ గురించి టెన్షన్ పడుతూ క్వాలిటీలో ఏమైనా రాజీ పడతామా అని డౌట్లు వచ్చేస్తున్నాయట వైట్లకి. మరి ఈ సినిమా అనుకున్న ప్రకారమే అక్టోబరు 15న రిలీజవుతుందో లేదో చూడాలి.