Begin typing your search above and press return to search.
ఆ లోటుని తీరుస్తానంటున్న రామ్ చరణ్
By: Tupaki Desk | 11 Aug 2015 5:07 AM GMT2015 ప్రధమార్ధమంతా కాస్త చప్పగానే సాగింది. ఈ ఏడాది మొదటి హిట్ గా కళ్యాణ్ రామ్ 'పటాస్' నిలిచింది. ఆ తరువాత విడుదలైన 'టెంపర్' యబోవ్ యావరేజ్ టాక్ తో 40కోట్ల క్లబ్బులోకి చేరింది. అక్కడితో మాస్ ని ఆకట్టుకునే పెద్ద సినిమాల జాబితా ఆగిపోయింది. ఆ తరువాత అన్నీ క్లాసీ మూవీసే అలరించాయి. మధ్యలో వచ్చిన 'బాహుబలి'ని మినహాయిస్తే బి,సి సెంటర్లు కోరుకునే ఒక్క పెద్ద హీరో సినిమా బయటకురావడంలేదు.
అల్లూ వారబ్బాయి విలువలు గురించి మాట్లాడితే, ఘట్టమనేని వారసుడు ఊరి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. తదుపరి విడుదలకానున్న రుద్రమదేవి, కిక్ 2 వంటి సినిమాలు కూడా యమా మాస్ చిత్రాలేమీ కాదు. అయితే ఈ లోటుని తాను పురుస్తానని రామ్ చరణ్ మాటిస్తున్నాడు.
ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఫైట్ మాస్టర్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే ఫైట్ సీక్వెన్స్ లతోపాటూ, వైట్ల మార్కు కామెడి, చరణ్ మార్కు డ్యాన్స్ వుంటుంది కాబట్టి ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా దసరాకి మన ముందుకు రానున్నట్టు తెలుస్తుంది.