Begin typing your search above and press return to search.

మండే ఎండలోనే మెగా షూటింగ్

By:  Tupaki Desk   |   6 April 2017 5:51 AM GMT
మండే ఎండలోనే మెగా షూటింగ్
X
రాజమండ్రి పరిసరాల్లో రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ నమోదవుతోంది. రాజమండ్రి పరిసరాలు అంటే గోదారి నదీ తీరం కావడంతో.. ఒకట్రెండు డిగ్రీలు తక్కువ ఉంటుందంటే.

అయినా సరే అంత వేడిలోను షూటింగ్ పూర్తి చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ మూవీ స్క్రిప్ట్ ప్రకారం.. కొంత భాగాన్ని ఎండ వేడిలోనే పూర్తి చేయాల్సి ఉంటుందట. సుక్కుతో సినిమా విషయంలో పూర్తి కాన్ఫిడెన్స్ ఉన్న చెర్రీ.. మండే ఎండల్లాంటివి లెక్క చేయకుండా సపోర్ట్ అందిస్తున్నాడట. అలాగే హీరోయిన్ సమంత కూడా ఏ మాత్రం తడబడకుండా తన వంతు షూటింగ్ చేస్తోందని తెలుస్తోంది. అసలే ఎండలు.. పైగా షూటింగ్ కి అవసరమైన లైటింగ్ కోసం ఏర్పాట్లు.. వీటన్నిటితోను షూటింగ్ స్పాట్ ఓ అగ్నిగోళంలా మండుతోందని అంటున్నారు.

అయినా సరే కథ ప్రకారం ఇలాంటి సిట్యుయేషన్ తప్పనిసరిగా ఉండాలని తెలుస్తోంది. మరికొన్ని వారాల పాటు ఇక్కడే షూటింగ్ చేయక తప్పదట. ఆ తర్వాత కూడా మళ్లీ ఈ ప్రాంతానికే వచ్చి షూటింగ్ చేయాల్సి ఉంటుందని.. కొన్ని పాటలను మాత్రం హైద్రాబాద్ స్టూడియోస్ లో సెట్స్ వేసి పిక్చరైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/