Begin typing your search above and press return to search.

చిరు మాట ఇద్దరూ వినలేదట

By:  Tupaki Desk   |   19 March 2018 5:17 AM GMT
చిరు మాట ఇద్దరూ వినలేదట
X
నిన్న రంగస్థలం ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు అమాంతం రెట్టింపయ్యాయి. సినిమా ఎలా ఉండబోతోంది అనేది కథ రూపంలో ఇందులో దాదాపు చూపించేయడంతో సుకుమార్ టేకింగ్ చరణ్ యాక్టింగ్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. చరణ్ ప్రతి సినిమా విషయంలో మేకింగ్ మొదలుకుని ఎడిటింగ్ వరకు తన ప్రమేయం ఉండేలా చూసుకునే చిరంజీవి దీని విషయంలో మాత్రం తటస్థంగా ఉన్నారట. కారణం చరణే అని టాక్. రషెస్ చూసినప్పుడు చిరు కొన్ని మార్పులు సూచించారట.కాని సుకుమార్ క్రియేటివిటీ మీద అపారమైన నమ్మకం ఉన్న చెర్రీ ఈ ఒక్క సినిమాని తన జడ్జ్ మెంట్ కి వదిలేయమని డాడీని రిక్వెస్ట్ చేసాడట. సరే చూద్దాం అనుకున్న చిరు ఆ తర్వాత లైట్ తీసుకున్నారని సమాచారం. మొత్తానికి ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. రన్ టైం లెంగ్త్ చూస్తే 2 గంటల 45 నిమిషాల దాకా తేలిందట.

దీంతో చిరు ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి అంత లెంగ్త్ ఉంటె ఇప్పుడున్న ట్రెండ్ లో వర్క్ అవుట్ కాదని చెప్పే ప్రయత్నం చేసారట. కాని సుక్కు మాత్రం చరణ్ తో ఇది కట్ చేయకుండా ఇలా ఉంటేనే చెప్పాలనుకున్న థీమ్ ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయగలమని చెప్పడంతో మార్పులు లేకుండా అదే నిడివితో సెన్సార్ కు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. చిరు తన అనుభవంతో చెప్పిన మాటను కాదని లెంగ్త్ విషయంలో కాంప్రోమైజ్ కాకుండా ముందుకు వెళ్తున్నారు అంటే కంటెంట్ మీద నమ్మకమే అంటున్నారు ఫాన్స్. 5 పాటలతో ఇంత నిడివితో ఉన్న సినిమాను విసుగు రాకుండా నడిపించాలంటే మాటలు కాదు. కాని సుక్కు ఈ విషయంలో ఫెయిల్ కాలేదని, అందుకే చరణ్ నాన్న మాటను మొదటిసారి కాదన్నారని ఇన్ సైడ్ టాక్.

మార్చ్ 30 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రంగస్థలం విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా రంగస్థలంకు మంచి రెస్పాన్స్ వస్తుందని, ఇలాంటి నేపధ్యం ఉన్న స్టార్ హీరో సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు కనక ఓపెనింగ్స్ విషయంలో కొత్త రికార్డ్స్ సెట్ చేస్తుందన్న ధీమాలో ఉన్నారు ఫాన్స్. చిరు సలహా కరెక్టా కదా అనే సంగతి మరో 10 రోజుల్లో తేలిపోతుంది.