Begin typing your search above and press return to search.
పల్లెటూళ్లో 'మెగా' పెళ్లి రోజు
By: Tupaki Desk | 14 Jun 2017 11:50 AM GMTసాధారణంగా పెళ్లిరోజంటే గ్రాండ్ గా జరుపుకోవాలని పార్టీలతో సందడి చేయాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం షూటింగ్ షెడ్యూల్ లో మధ్యలో తన పెళ్లి రోజు రావడంతో యూనిట్ కు ఇబ్బంది కలగకుండా సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 అనే సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ డ్రామాగా నడిచే ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లోని గోదావరి తీర గ్రామాల్లో జరుగుతోంది. ఇందులో చరణ్ పల్లెటూరి యువకుడి పాత్ర పోషిస్తున్నాడు.
జూన్ 14 రామ్ చరణ్ - ఉపాసనల పెళ్లి రోజు. రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ నిమిత్తం రాజమండ్రిలోనే ఉన్నాడు. తన పెళ్లిరోజు సందర్భంగా షూటింగ్ కు బ్రేక్ రాకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో ఈ స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఉపాసన రాజమండ్రి బయలుదేరి వెళ్లింది. షూటింగ్ జరుగుతున్న గ్రామంలో చరణ్ వెంటే ఉంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ సి’కి ఐదేళ్లు. కుటుంబ సభ్యలు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాల కారణంగా ఇన్నేళ్లూ సంతోషంగా గడిచాయంటూ ఉపాసన ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.
అయినా ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనాలు ఏలనో.. అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా ఉంటా చాలదా అంటూ గుండమ్మకథలో అలనాటి రచయిత పింగళి నాగేంద్రరావు రాసిన మాట అక్షర సత్యమని వీరిద్దరిని చూస్తే ఒప్పుకునే తీరాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/