Begin typing your search above and press return to search.
మెగా కపుల్ భలే ఉన్నారే
By: Tupaki Desk | 28 May 2018 4:17 AM GMTఈ జనరేషన్ స్టార్లు.. వారి కుటుంబాలతో కలిసి ఫారిన్ టూర్స్ కు.. వెకేషన్స్ కు.. ఫ్యామిలీ ఈవెంట్స్ కు వెళుతున్న విషయాలు జనాలకు బాగానే తెలుస్తున్నాయి. గతంలో కూడా ఇలా వెళ్లేవారే కానీ.. జనాలకు తెలియదంతే. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సెలబ్రిటీలు.. తమ మూవ్మెంట్స్ ను తామే చెబుతూ అలరిస్తున్నారు.
రామ్ చరణ్- ఉపాసన.. ఇప్పుడెక్కడ ఉన్నారో తెలుసా? ఫ్రాన్స్ లో వీరిద్దరూ చక్కర్లు కొడుతున్నారు. సమ్మర్ చివరకు వచ్చింది కాబట్టి.. ఏదో వెకేషన్ కు వెళ్లి ఉంటారులే అనుకోవచ్చు. అయితే.. ఈ సారి వీరి ట్రిప్పు మాత్రం సమ్మర్ టూర్ కాదు. ఓ ఫ్యామిలీ ఈవెంట్ కోసం ఆ యూరోప్ దేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఛాంటిల్లి (Chateau de Chantilly) అనే చిన్నపాటి జమీందారి కోటలో వాళ్ల ఫ్యామిలీకి సంబంధించి ఎవరిదో పెళ్ళి జరుగుతోందట. వాళ్ల కుటుంబం అంటే.. ఉపాసన తరఫున వారి పెళ్ళి అట.
పెళ్లి ఈవెంట్ సరే కానీ.. ఆ కోట ముందు వీరిద్దరు కలిసి దిగిన ఫోటోనే మరీ అట్రాక్టివ్ గా ఉంది. ఉపాసన వైట్ డ్రెస్ లో కానీ ఉండి ఉంటే.. ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు వెళుతున్న కొత్త జంట అని పొరపడే అవకాశం కూడా ఉంది. పెళ్లి చేసుకున్న కొన్ని ఏళ్లు గడుస్తున్న ఇంకా కొత్త జంట మాదిరిగా చక్కర్లు కొడుతున్న వీరిద్దరినీ అభినందించాల్సిందే.