Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : మెగా లవ్ లాక్

By:  Tupaki Desk   |   14 Feb 2018 8:05 AM GMT
ఫోటో స్టోరీ : మెగా లవ్ లాక్
X
వాలెంటైన్ డే సందర్భంగా ప్రేమికులంతా తమ తమ పార్టనర్స్ తో మర్చిపోలేని జ్ఞాపకాల కోసం పరుగులు పెడుతుంటే మెగా కోడలు ఉపాసన కూడా తనదైన శైలిలో ట్విట్టర్ లో భర్త రామ్ చరణ్ తో ఉన్న లవ్లీ పిక్స్ ని షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది. అందులో చరణ్ తో ఉన్న ఉపాసన వివిధ ప్రేమికుల పేర్ల మీద లాక్ చేసిన తాళాల గుత్తిలో వాటితో పాటు తమది కూడా జోడిస్తున్నాను అని చెబుతూ విషెస్ చెప్పింది. మా లవ్ ని శాశ్వతంగా లాక్ చేస్తున్నాను అని చెప్పిన ఉపాసన తనకు చరణ్ మీద ఎంత ప్రేమ ఉందో మరో సారి బయట పెట్టుకుంది. స్వతహాగా చరణ్-ఉపాసనలది ప్రేమ వివాహం కాబట్టి ఇప్పుడు చేసిన ట్వీట్ కి ఇంకాస్త బలం చేకూరుతోంది. రంగస్థలం ఫినిషింగ్ లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్న చెర్రికి ఇది స్పెషల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు.

ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి దాన్ని ఫోటోని షేర్ చేసుకుని అందరు వెళ్ళే దారిలో కాకుండా కాస్త కొత్తగా ఆలోచించిన ఉపాసనపై మెగా ఫాన్స్ తో పాటు రెగ్యులర్ ఫాలోయర్స్ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.బలమైన కుటుంబ నేపధ్యం ఉన్న సెలబ్రిటీ కపుల్ అయినప్పటికీ ఆ ఫీలింగ్ ఎక్కడా కనిపించకుండా అవకాశం దొరికినప్పుడల్లా చరణ్ మీద తన అభిమానాన్ని చాటుకునే ఉపాసన చరణ్ షూటింగ్ జరుగుతున్న ప్రతి సారి వీలు కుదిరినప్పుడంతా అక్కడికి వెళ్తూ కంపెనీ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య హెల్త్ అవేర్ నెస్ కోసం సోషల్ మీడియాలో వినూత్నమైన కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసిన ఉపాసన దానికి భారీ స్పందన అందుకుంటోంది. ఆరోగ్య పరంగా చిక్కులు లేకుండా ఎలా ఉండాలో తనే స్వయంగా పాటించి మరీ ఆ మార్పును కూడా పోస్ట్ చేయటం బాగా ఆకట్టుకుంది.

ఇప్పుడు ప్రేమికుల రోజు నాడు చరణ్ తో తన లవ్ ఫీలింగ్స్ మరోసారి బయట పెట్టుకున్న ఉపాసన తాను సినిమాకు సంబంధించిన పనిలో నేరుగా లేకపోయినప్పటికీ చరణ్ ద్వారా అభిమానుల మెప్పును బాగానే పొందుతోంది. నిర్మాతగా, హీరోగా డ్యూయల్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ కు ఇలా చేయూత ఇచ్చే పార్టనర్ కదా కావలసింది.