Begin typing your search above and press return to search.

మిస్ట‌ర్ సి సండే ట్రైనింగ్ చూశారా?

By:  Tupaki Desk   |   8 July 2019 5:54 AM GMT
మిస్ట‌ర్ సి సండే ట్రైనింగ్ చూశారా?
X
ఒకే చోట ఇద్ద‌రు ఫిట్ నెస్ ఫ్రీక్స్ ఉంటే ఇంకేమైనా ఉందా? ఫిట్ నెస్ గోల్స్ గురించి అదే ప‌నిగా చెవిన ఇల్లు క‌ట్టుకుని పోరుతారు. హెల్త్ విష‌యంలో ఏమాత్రం ఏమ‌రుపాటు త‌గ‌ద‌ని సెల‌విస్తుంటారు. అపోలో గ్రూప్స్ - బీపాజిటివ్ మ్యాగ‌జైన్ య‌జ‌మానిగా ఉపాస‌న చేస్తున్న సేవ‌ల గురించి తెలిసిందే. తాను ఫిట్ గా ఉండేందుకు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తూనే ప‌ది మందికీ హెల్త్ టిప్స్ చెబుతూ రెగ్యుల‌ర్ గా చైత‌న్య‌వంతుల్ని చేయ‌డం హాబీగా కొన‌సాగిస్తున్నారు.

యోగా- ధ్యానం- జిమ్ అన్ని ఫార్మాట్ల‌లోనూ ఉపాస‌న ఎక్స్ ప‌ర్ట్. 2018-19 సీజ‌న్ లో ఉపాస‌న మేకోవ‌ర్ గురించి తెలిసిందే. ఊహ‌కే అంద‌ని కొత్త లుక్ కి మారిపోయి అభిమానుల‌కు షాకిచ్చారు. అయితే త‌న హార్డ్ వ‌ర్క్ వెన‌క మిస్ట‌ర్ సి అనే షాడో ఉన్నాడ‌ని ప్ర‌తిసారీ ఉపాస‌న గుర్తు చేస్తారు. ఇదిగో ఇలా జిమ్ కి వ‌చ్చాక ప్ర‌త్యేకించి శిక్ష‌ణ త‌ర‌గ‌తులు త‌ప్ప‌నిస‌రి. క్ష‌ణం తీరిక లేకుండా క‌స‌ర‌త్తులు చేయాల్సిందే.

పైగా జిమ్ చేసేందుకు సండే మండే అనే తేడానే లేదు. ఆదివారం అయినా వేకువ ఝామునే లేచి ఇలా క‌స‌ర‌త్తులు చేయాల్సిందే. ఇదే విష‌యాన్ని ఉపాస‌న స్వ‌యంగా ఇలా ఫోటో ప్రూఫ్ తో పాటుగా ఇన్ స్టాలో షేర్ చేశారు. సండే ట్రైనింగ్ విత్ మిస్ట‌ర్ సి! అంటూ వ్యాఖ్య‌ను జోడించారు. విప‌రీతమైన బ‌రువులు ఎత్తాల్సిన ప‌ని లేకుండా కాస్తంత సింపుల్ గా చేసే ఎక్స‌ర్ సైజుల్ని ఉపాస‌న‌కు నేర్పిస్తున్నారు చ‌ర‌ణ్‌. చెర్రీ ఇచ్చే ప్ర‌తి టిప్ ని అభిమానుల‌కు రివీల్ చేసే ఉపాస‌న ఈసారి కూడా తాను నేర్చుకున్న టిప్స్ ని అంద‌రికీ వీడియో ద్వారా చేర‌వేస్తారేమో చూడాలి. ఇటీవ‌లే పెళ్లి రోజు సంద‌ర్భంగా.. ఆఫ్రికాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్ర‌ఫీని ఈ జంట‌ ఎంజాయ్ చేసిన సంగ‌తి తెలిసిందే.