Begin typing your search above and press return to search.
చరణ్ పెళ్లిరోజును కూడా ట్రెండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..!
By: Tupaki Desk | 14 Jun 2021 11:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. మెగా కాంపౌండ్ లో చిరు తరువాత అగ్ర తాంబూలం అందుకోడానికి కష్టపడుతున్న చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అశేష అభిమానులను సంపాదించుకున్న చెర్రీ.. తన మార్కెట్ ని విస్తరించుకుంటూ వస్తున్నాడు.
సినిమాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రి బాటలో నడుస్తున్న చరణ్.. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో భాగంగా మంచి పనులు చేస్తూ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ను తన ఆర్మీగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులు రామ్ చరణ్ బర్త్ డేను భారీ ఈవెంట్ మాదిరిగా సెలబ్రేట్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చరణ్ పెళ్లి రోజు నాడు కూడా హంగామా చేయడమే కాస్త మీటర్ క్రాస్ అయినట్లుగా అనిపిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
2012 జూన్ 14న వివాహం చేసుకున్న రామ్ చరణ్ - ఉపాసన జంట.. నేడు తొమ్మిదవ పెళ్లి రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారికి విషెస్ అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. దీన్ని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేయడమే ఇబ్బందిగా ఉందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వస్తున్నాయి. కామ్ గోయింగ్ గా ఉండే చెర్రీ మెప్పుపొందడానికి కొందరు అభిమానులు ఇలాంటివి చేస్తున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తో కలిసి 'ఆర్.ఆర్.ఆర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అలానే కొరటాల శివ దర్శకత్వంలో తన తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత శంకర్ తో కలిసి ఓ భారీ సినిమా చేయనున్నాడు. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్న చరణ్.. 'ఆచార్య' తో పాటుగా 'లూసిఫర్' తెలుగు రీమేక్ కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.