Begin typing your search above and press return to search.

ఉపాసన షేర్ చేసిన దసరా స్పెషల్‌ ఫోటో వైరల్‌

By:  Tupaki Desk   |   6 Oct 2022 7:42 AM GMT
ఉపాసన షేర్ చేసిన దసరా స్పెషల్‌ ఫోటో వైరల్‌
X
మెగాస్టార్‌ వారి ఇంటి కోడలు ఉపాసన కొణిదెల దసరా సందర్భంగా షేర్‌ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మరియు చిరంజీవి అమ్మగారు అంజనా దేవి గారిని చూడవచ్చు. ఇద్దరితో పాటు ఉపాసన కూడా ఫోటోలో కళకళలాడుతూ కనిపిస్తున్నారు.

ఉపాసన మరియు రామ్‌ చరణ్ మధ్య లో అంజనా దేవి గారిని చూస్తూ ఉంటే చాలా క్యూట్‌ గా అనిపిస్తుందని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఉపాసన ఎప్పుడు ఏ ఫోటో షేర్‌ చేసినా కూడా చాలా స్పెషల్‌ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పోటో కూడా చాలా ఆకర్షణీయంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో మెగా అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తూ చక్కనైన ఉపాసన నవ్వును చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్‌ చరణ్ ఎంత లక్కీనో కదా అంటూ ఉపాసన నవ్వు ను చూస్తే అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలా పండుగ పూట కుటుంబంతో సాధ్యం అయినంత ఎక్కువ సమయంను గడిపేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో సినిమా ను చేస్తున్నాడు.

ఇదే సమయంలో ఆయన నిర్మాతగా చేసిన గాడ్‌ ఫాదర్‌ సినిమా విడుదల అయ్యింది. మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.