Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః గెడ్డాల్లో అన్నదమ్ములు

By:  Tupaki Desk   |   2 Nov 2017 1:12 PM GMT
ఫోటో స్టోరిః గెడ్డాల్లో అన్నదమ్ములు
X
టాలీవుడ్లో కూడా బాలీవుడ్ తరహాలో మా చుట్టాలు మా చుట్టాలు అంటూ మన హీరోలందరూ వారి వాళ్ల బ్యాచ్చులతో బాగా ఎంజాయ్ చేస్తూ.. వాటిని బయటకు కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్లన్నీ భలే ఊరిస్తున్నాయి. మొన్ననే రామ్ చరణ్‌ అండ్ బన్నీ కలసి మనాలి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వారు హాలోవీన్ పార్టీ కూడా చేసుకున్నారు.

ఇకపోతే ఆ సందర్భంగా ప్రస్తుతం రెస్టులో ఉన్న మెగా అన్నదమ్ములు ఇద్దరూ కలసి ముసిముసిగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. నో షేవ్ నవంబర్ అంటున్నారో.. లేకపోతే వీరు చేసే సినిమాల్లో గెడ్డాలు పెంచాల్సిన అవసరం వచ్చిందో తెలియదు కాని.. ఇటు రామ్ చరణ్‌ అటు వరుణ్‌ తేజ్. ఫుల్లుగా గెడ్డాలు పెంచి ఫోటోలకు ఫోజిచ్చారు. పైగా మా గెడ్డం చూడండి అంటూ తెగ మురిసిపోతున్నారు.

ప్రస్తుతం రంగస్థలం సినిమా షూటింగ్ షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. అందుకే రామ్ చరణ్‌ తన టైమును అలా తన అన్నదమ్ములతో కజిన్స్ తో స్పెండ్ చేస్తున్నాడు. ఇక వరుణ్‌ తేజ్ కూడా లండన్లో తన కొత్త సినిమా షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని మొన్ననే తిరిగొచ్చాడు. మనోడు కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు. అందుకే ఇద్దరు అన్నదమ్ములు ఇలా కలసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఎవరు తీశారనేగా? ఇంకెవరు.. చెర్రీ వైఫ్‌ ఉపాసన వీరిని అలా క్లిక్ అనిపించిందట.