Begin typing your search above and press return to search.

ఉపాసన ఫస్ట్ ప్రెగ్నెన్సీ.. పదేళ్ళ టైమ్ ఎందుకంటే?

By:  Tupaki Desk   |   12 Dec 2022 5:30 PM GMT
ఉపాసన ఫస్ట్ ప్రెగ్నెన్సీ.. పదేళ్ళ టైమ్ ఎందుకంటే?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన తల్లి కాబోతున్నట్లు మెగా కాంపౌండ్ నుంచి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఈ విషయాన్ని మెగా హీరోలు అలాగే వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకున్నారు. వారికి ఇష్టదైవమైన ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా కూడా ఒక ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో అయితే సంబరాలు నెలకొన్నాయి అని చెప్పవచ్చు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషంగా ఉన్నారు అని తెలుస్తోంది. ఈరోజు కోసమే ఆయన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ ఉపాసన 2012లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు పదేళ్ళు పూర్తయిన తర్వాత వారి మొదటి సంతానం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు వారు తల్లిదండ్రులు కావాలని అనుకున్నారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే ముందుగా రామ్ చరణ్ అయితే తన భార్య కోరిక మేరకు నడుచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడే ముందడుగు వేయాలని అనుకున్నారు. ఇక ఉపాసన తన ఫ్యామిలీ లైఫ్ లో రాంచరణ్ తో ఎక్కువగా తన ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకున్నారు. ఒకవైపు అపోలో బాధ్యతలను చూసుకుంటూనే మరొకవైపు రాంచరణ్ తో ప్రేమ ప్రయాణం ఎంతో చక్కగా కొనసాగించారు.

ఒక విధంగా పెళ్లయిన ఐదేళ్ళ వరకు వారు పిల్లలను వద్దనుకున్నారట. అయితే పెళ్లి తరువాతనే అపోలో సామ్రాజ్యానికి ఉపాసన సహకారం కూడా ఎంతగానో ఉపయోగపడింది. అయితే ఎప్పుడైతే ఆ బాధ్యతలకు కొంత గ్యాప్ ఇవ్వాల్సి వస్తుందో అప్పుడే మొదటి సంతానం విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నారు.

గత రెండు మూడేళ్ల నుంచి ఈ విషయం గురించి ఇద్దరు కూడా చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫైనల్ గా ఇప్పుడు అపోలోకు సంబంధించిన పనులకు గ్యాప్ ఇచ్చిన ఉపాసన తన ఫ్యామిలీ లైఫ్ ను మరో స్టేజ్ కు తీసుకు వెళ్ళడానికి రెడీ అయింది. మెగా ఫ్యామిలీలో మూడో తరానికి వారు నాంది పలకబోతున్నారు. ఇక ఈ సందర్భంగా అందరికంటే ఎక్కువగా ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.