Begin typing your search above and press return to search.
చెర్రీలో ఆ వేరియేషన్ కూడానా
By: Tupaki Desk | 11 May 2017 5:27 PM GMTరామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవడమే కాదు.. ఓ షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది. ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా చేసేశారు. ఈ సినిమాలో చెర్రీ ఓ విలేజ్ గెటప్ లో కనిపిస్తాడనే సంగతి ఇప్పటికే తెలుసు. పంచెకట్టుతో కనిపించి ప్రేక్షకులను ప్రేమలో ముంచెత్తే పాత్రలో చరణ్ కనిపించనున్నాడు.
ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమా.. ఫక్తు ప్రేమకథతో తెరకెక్కుతోంది. అయితే.. ఈ మూవీలో చెర్రీ పాత్రకు కాసింత వినికిడి లోపం ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే.. ఈ మూవీలో పల్లెటూరి వ్యక్తి గెటప్ లోనే కాకుండా.. చరణ్ మరో రూపంలో కూడా కనిపిస్తాడట. మెడికల్ ల్యాబ్ రీసెర్చర్ పాత్రలో కూడా రామ్ చరణ్ దర్శనం ఇస్తాడని తెలుస్తోంది. ఈ పాత్ర మూవీకి చాలా కీలకంగా ఉండడమే కాదు.. రెండు గెటప్ లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ లింక్ కూడా ఉంటుందిట. అయితే.. అసలు రెండు వేరియేషన్స్ లో కనిపిస్తాడా? ఇవి రెండూ వేర్వేరు పాత్రలా.. రెండు గెటప్ లా.. అన్న విషయంపై కూడా ఇంకా క్లారిటీ లేదు.
సుకుమార్ లాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ మూవీ కావడంతో.. ఈ సినిమా థీమ్ ను ముందుగా అంచనా వేయడం అంత తేలికేమీ కాదు. ఇలాంటి థ్రిల్స్ అన్నీ ఆన్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని తెలుసుకుని ఆనందించడం తప్ప..అసలు విషయం సినిమా చూస్తే తప్ప అర్ధం కాదులే!