Begin typing your search above and press return to search.
చరణ్ అలా చేయడం ఇదే మొదలు
By: Tupaki Desk | 16 Feb 2018 4:17 AM GMTరామ్ చరణ్ తేజ్ ఫైట్లు బాగా చేస్తాడు. ఇది చాలా సినిమాల్లోనే చూశాం. డ్యాన్సులు బాగా చేస్తాడు. అది చాలా సినిమాల్లోనే చూశాం. గుర్రపు స్వారీ.. డేంజరస్ స్టంట్లు వంటివి చేయగలడు. మగధీరలో రాజమౌళి అదీ చూపించేశాడు. అతడిలో ఇంతవరకు ఎలివేట్ కాని ఓ కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట డైరెక్టర్ సుకుమార్.
సుకుమార్ డైరెక్ఘన్ లో రామ్ చరణ్ చేస్తున్న పీరియాడికల్ ఫిలిం రంగస్థలంలో అతడు చెవిటివాడిగా నటించాడు. ఈ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని.. ఇది రామ్ చరణ్ లోని కామెడీ యాంగిల్ ను సూపర్ గా ఎలివేట్ చేసిందని రంగస్థలం యూనిట్ సభ్యులు అంటున్నారు. రామ్ చరణ్ లోని కామిక్ యాంగిల్ ఇంతవరకు ఏ సినిమాలోనూ పెద్దగా ఎలివేట్ కాలేదని... ఇప్పుడు రంగస్థలం సినిమాకు ప్లస్లవుతుందనేది వారి మాట. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పంచే నవ్వులు మామూలుగా ఉండవని.. ముఖ్యంగా హీరోయిన్ సమంతతో అతడు కనిపించే సన్నివేశాలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతాయని అంటున్నారు.
కదిలించే కథకు కావలసినంత నవ్వులు జోడిస్తే కచ్చితంగా ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. సుకుమార్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మెగా అభిమానులకు మరీ ఆనందాన్నిస్తోంది. రామ్ చరణ్ ఎంతవరకు నవ్విస్తాడో తెలియాలంటే మార్చి ఆఖరు వరకు ఆగాల్సిందే.