Begin typing your search above and press return to search.
ఆ పనితో రామ్ చరణ్ మనసు దోచాడు
By: Tupaki Desk | 12 Nov 2018 11:29 AM GMTటాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ అన్నవి దశాబ్దాలుగా ఉన్నాయి. కానీ హీరోలు మాత్రం సాధ్యమైనంత వరకు సన్నిహితంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. అందులోనూ ఈ మధ్య మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి స్టార్లు చాలా సఖ్యతతో మెలుగుతూ అభిమానుల మధ్య అంతరాల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్-చరణ్ కాంబినేషన్లో సినిమా కూడా మొదలైపోతుండటంతో పరిస్థితులు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ వార్స్ ఏమీ ఆగుతున్నట్లు కనిపించడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ.. ఎవరికెంత పారితోషకం అనే విషయాల్లో సోషల్ మీడియాలో జనాలు వాదించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభోత్సవం సందర్భంగా రామ్ చరణ్ చేసిన పని.. ఇలా గొడవలు పడే అభిమానులకు గడ్డి పెట్టింది.
తమ ఇద్దరిలో ఎవరూ ఎక్కువకాదు.. ఎవరూ తక్కువ కాదు అని చాటి చెబుతూ చరణ్ ప్రారంభోత్సవంలో చాటి చెప్పాడు. పూజ సందర్భంగా కొబ్బరి కాయ కొట్టమని అతడి చేతికిస్తే.. కొంచెం దూరంగా ఉన్న తారక్ దగ్గరికెళ్లి అతడి చేతిని కొబ్బరికాయకు ముట్టించి.. ఆ తర్వాత వచ్చి కాయ కొట్టాడతను. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ సంస్కారాన్ని అందరూ పొగిడేస్తున్నారు. కానీ దీన్ని చూపించి కూడా మా హీరో గ్రేట్ చూశారా అంటూ అవతలి వాళ్లను రెచ్చ గొట్టే జనాలు కూడా లేకపోలేదు. ఆ సంగతలా వదిలేస్తే చరణ్ చర్య మాత్రం అభినందనీయం. సినిమా విషయంలో కూడా ఇద్దరూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోవడం ఖాయం. నవంబరు 19న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న సంగతి తెలిసిందే.