Begin typing your search above and press return to search.
డాడీలానే బాబాయ్ ని రీలాంచ్ చేస్తాడా?
By: Tupaki Desk | 24 Sep 2019 7:30 AM GMTఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధాంతం. అందుకు సైరా ఈవెంట్ ప్రత్యక్ష సాక్ష్యం. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందు వరుసలో నించుంటే చరణ్ మాత్రం వెనక వరుసలోనే ఉండి అంతా పరిశీలించారు కానీ.. ఆ ఇద్దరితో సమానంగా హడావుడి చేయడం ఎక్కడా కనిపించలేదు. ఆ ముగ్గురు ఈ వేడుకలో ఒకే సీట్లో కూచుని కనిపించారు. ఓవైపు మెగాస్టార్ మరోవైపు పవర్ స్టార్ మధ్యలో చరణ్ కనిపించడం అభిమానులకు కన్నుల పండుగగా కనిపించింది.
డాడీ బాబాయ్ అంటే అంతటి గౌరవం ప్రేమాభిమానం చెర్రీకి ఎప్పుడూ ఉన్నాయి. ఆ ఇద్దరిపై కనీసం ఈగను అయినా వాలనివ్వడు. వాళ్ల ముందు నిలబడేందుకైనా ఆలోచిస్తాడు.. డౌన్ టు ఎర్త్ ఉండడం ఆ వేదికపై ప్రత్యక్షంగా కనిపించింది. ఇక చెర్రీలోని ఈ యాటిట్యూడ్ అందరికీ నచ్చుతోంది. ఆసక్తికరంగా ఈ వేదికపై చరణ్ ని ముందుకు రావాల్సిందిగా పవన్ పదే పదే కోరినా అంత పెద్ద వాళ్ల ముందు నుంచునేందుకు వెనకాడడం కనిపించింది. ఎంతో వినయంగా వినమ్రతతో అతడు వెనక్కి జరిగి నిలుచున్నాడే కానీ నేను మెగా నిర్మాతను అన్న ఇది ఎక్కడా చూపించలేదు. ఇకపోతే ఈ వేదికపై మెగాస్టార్ ముందు ఇతర స్టార్లు టెక్నీషియన్లు అంతా ఎంతో ఒదిగి కనిపించారు. అభిమానం కనబరచడం ఆసక్తికరం.
ఇకపోతే మెగాస్టార్ రీఎంట్రీని ఘనంగా చాటుకునేలా రెండు భారీ చిత్రాల్ని నిర్మించారు రామ్ చరణ్. అందుకోసం తన కెరీర్ ని సైతం వదులుకుని చెర్రీ చాలానే సమయం వెచ్చించారు. డాడీకి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ని ఇచ్చాడు. అలాగే చరిత్రలో నిలిచిపోయేలా `సైరా-నరసింహారెడ్డి` లాంటి స్పెషల్ మూవీని నిర్మించి కానుకగా ఇస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం నాలుగు వెర్షన్లతో ప్రపంచ దేశాల్లో రిలీజవుతోంది. ఈ సందర్భంగా మెగాభిమానుల్లో మరో ఆసక్తికర టాపిక్ చర్చకొచ్చింది. డాడ్ రాజకీయాల్లోకి వెళ్లాక తనని రీలాంచ్ చేసేందుకు ఇదంతా చేసిన రామ్ చరణ్ ఇప్పుడు బాబాయ్ కోసం అదే చేయబోతున్నాడా? అన్నదే ఆ చర్చ సారాంశం. ఒకవేళ పవన్ రీలాంచ్ సినిమాని డాడీ రీలాంచ్ సినిమాలా చేస్తాడా? అంటూ ఫ్యాన్స్ తో పాటు.. ఇండస్ట్రీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక అన్నయ్య చిరంజీవి రీలాంచ్ సినిమాని చేయలేకపోయానని పవర్ స్టార్ చెబుతుంటారు. ఆ అవకాశం అదృష్టం చరణ్ కి దక్కడం ఆనందంగానే ఉందని అంటారు. మరి ఇప్పుడు రివర్సులో పవన్ ని రీలాంచ్ చేసేందుకు అబ్బాయ్ చరణ్ రెడీ అవుతున్నారా? ఒకవేళ చరణ్ రెడీ అంటే అతడితో జాయింట్ వెంచర్ కి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ రెడీగానే ఉన్నారు మరి. పింక్ రీమేక్ పవన్ తో చేయాలని ఆయన తలపోస్తున్నారని వార్తలొచ్చాయి.