Begin typing your search above and press return to search.

ముగ్గురు బ్రదర్లకు విషెస్ చెప్పిన చెర్రి

By:  Tupaki Desk   |   8 April 2017 7:30 AM GMT
ముగ్గురు బ్రదర్లకు విషెస్ చెప్పిన చెర్రి
X
రామ్ చరణ్ పెట్టే ట్వీట్స్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాయి. ఒకవైపు మొగ్గకుండా.. అందరినీ సమానంగా పాజిటివ్ యాంగిల్ నుంచి చూడడం మెగా పవర్ స్టార్ స్పెషాలిటీ. ఇవాళ ప్రత్యేకంగా పెట్టిన బర్త్ డే విషెస్ ట్వీట్ పెట్టాడు చెర్రీ.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు అన్న విషయం మెగాభిమానులు అందరికీ తెలుసు. అలాగే అదే రోజున అఖిల్ పుట్టిన రోజు అనే విషయం అక్కినేని అభిమానులకు తెలుసు. ఇక ఇదే ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు కూడా. చరణ్-అర్జున్.. ఈ బావాబావమరుదులు ఇద్దరికీ ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ అంటూ అఖిల్ స్వయంగా చెప్పాడు కూడా. మరోవైపు చరణ్ కి స్వయానా తమ్ముడు అకీరా. అందుకే అల్లు అర్జున్.. అఖిల్.. అకీరా.. ముగ్గురికీ ఒకేసారి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు రామ్ చరణ్.

'ఒకేరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియమైన సోదరులు ముగ్గురికి వెరీ హ్యాపీ బర్త్ డే. మీ అందరికీ ఈ రోజు ఎంతో అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నా' అన్నాడు రామ్ చరణ్. ఈ ముగ్గురితో తను పంచుకున్న అద్భుత క్షణాలను ఫోటోల రూపంలో పోస్ట్ చేసాడు చరణ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/