Begin typing your search above and press return to search.

నీ మంచితనం ఎప్పటికి వృథా అవ్వదు : చరణ్‌

By:  Tupaki Desk   |   20 July 2020 5:30 PM GMT
నీ మంచితనం ఎప్పటికి వృథా అవ్వదు : చరణ్‌
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మరియు ఆయన భార్య ఉపాసనలు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరి సోషల్‌ మీడియా పోస్ట్‌ లతో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మరియు ఒకరిని మరొకరు గౌరవించుకోవడం నిజంగా అందరికి ఆదర్శనీయంగా ఉంటుంది. చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది ఉపాసన. ఇప్పుడు అంతే ప్రేమ అభిమానం చూపిస్తూ ఉపాసన బర్త్‌ డే సందర్బంగా చరణ్‌ చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఉపాసన బర్త్‌ డే సందర్బంగా ఇన్‌ స్టా లో ఆమె బ్యూటీ ఫుల్‌ ఫొటోను షేర్‌ చేసిన చరణ్‌.. నీవు ఇతరుల పట్ల చూపించే దయ నీవు చేసే పనులు ఎంత చిన్నవి అయినా కూడా ఎన్నటికి వృథా అవ్వవు. నీయొక్క మంచి పనులు ఇలాగే కొనసాగిస్తూ వెళ్తావని ఆశిస్తున్నాను. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నీకు మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను హ్యాపీ బర్త్‌ డే అంటూ పోస్ట్‌ చేశాడు.

వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలను అందుకున్న ఉపాసన చేసే సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఎంతో మందిని చైతన్య పర్చడంతో పాటు సమాజంలో మార్పు కోసం తనవంతు కృషి చేస్తూ ఉన్న ఉపాసనకు మెగా ఫ్యాన్స్‌ కూడా సోషల్‌ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.