Begin typing your search above and press return to search.

కొత్త పెళ్లికూతురికి అన్నా వ‌దిన‌లు బ‌ర్త్ డే విషెస్

By:  Tupaki Desk   |   19 Dec 2020 3:30 PM GMT
కొత్త పెళ్లికూతురికి అన్నా వ‌దిన‌లు బ‌ర్త్ డే విషెస్
X
మెగా ప్రిన్సెస్ నిహారిక .. ఐజీ కుమారుడు చైత‌న్య జొన్న‌ల గ‌డ్డ‌ను వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ముగించి అటుపై హైద‌రాబాద్ లో ఘ‌న‌మైన రిసెప్షన్ ని ఏర్పాటు చేయ‌గా టాలీవుడ్ అతిథులు విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

నిహారిక పెళ్లిలో క‌జిన్స్ సంద‌డి గురించి తెలిసిందే. ఈ పెళ్లిలో బావ‌లు స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించ‌గా.. అన్న‌య్య‌లు మాత్రం కంటికి రెప్ప‌లా కాచుకుని చెల్లెమ్మ పెళ్లి సంబ‌రాల్ని అంబ‌రాన్నంటేలా దగ్గ‌రుండి మ‌రి చూసుకున్నారు. ఇంత‌కుముందు త‌న అన్న వ‌రుణ్ తేజ్ ని నుదుటిపై ప్రేమ‌పూర్వ‌కంగా ముద్దాడి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది నిహారిక‌. అన్న అంటే త‌న‌కు ఎంత అనురాగ‌మో తెలిపింది ఆ దృశ్యం.

ఇక నిహారిక కు పెద్ద‌న్న‌య్య రామ్ చ‌ర‌ణ్ అన్నా అంతే అభిమానం. ఆ ఇద్ద‌రితో ఇదిగో ఇలా అదిరిపోయే ఫోజిచ్చింది. 18 డిసెంబ‌ర్ నిహారిక పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అన్నా వ‌దిన‌లు రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ ఫోటోని షేర్ చేశారు. లావ‌ణ్య త్రిపాఠి.. స్నేహా రెడ్డి సైతం బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. ఇప్ప‌టికీ నిహారిక‌కు బిలీటెడ్ విషెస్ అందుతున్నాయి.