Begin typing your search above and press return to search.
సాంగ్స్ తీస్తే చెర్రీ సినిమా రెడీ
By: Tupaki Desk | 15 Jun 2018 4:32 PM GMTరామ్ చరణ్ సినిమా విషయంలో బోయపాటి శ్రీను ఎంత ప్లానింగ్ తో ఉన్నాడో తెలిసిందే. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో.. చెర్రీ ఇంకా షూటింగ్ కు రాకముందే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసేసేశాడు కూడా. చరణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మొదట యాక్షన్ ఎపిసోడ్స్ తో మొదలుపెట్టి.. తర్వాత ఫ్యామిలీతో రిలేట్ అయ్యే సన్నివేశాలను రూపొందించారు.
ఇప్పుడు హైద్రాబాద్ లో చెర్రీ సినిమా షూటింగ్ మరుసటి షెడ్యూల్ ప్రారంభమైంది. మూడు వారాల పాటు ఈ షూటింగ్ జరగనుండగా.. ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొబోతున్నారు. ప్రధానంగా ఈ షెడ్యూల్ మొత్తాన్ని క్లైమాక్స్ కోసం కేటాయించారట. బోయపాటి మార్క్ లో రామ్ చరణ్ మాస్ యాక్షన్ శైలిని పూర్తిగా ఉపయోగించుకునే స్థాయిలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే కొన్ని సన్నివేశాలతో రీషూట్ చేశారనే టాక్ కూడా ఉంది కానీ.. ఇప్పుడు ప్రారంభమైన షెడ్యూల్ తో.. దాదాపు టాకీ పార్ట్ షూటింగ్ మాత్రం పూర్తయిపోతుందంట.
ఈ షెడ్యూల్ పూర్తయ్యాక కేవలం పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంటుందని తెలుస్తోంది. వీటికోసం యూరోప్ వెళ్లనున్నారట టీం. రామ్ చరణ్.. కైరా అద్వానీలపై ఈ పాటలు రూపొందనున్నాయి. ఈ పాటలు పూర్తి చేస్తే చెర్రీ-బోయపాటి సినిమా రెడీ అయిపోయినట్లే. యూరోప్ అందాలతో పాటు చెర్రీ స్టెప్పులు-కైరాలు జనాలను మైమరపించడం ఖాయంగా చెప్పవచ్చు.