Begin typing your search above and press return to search.

డ్యాన్సులు ఉతికి ఆరేసిన బ్రూస్ లీ

By:  Tupaki Desk   |   2 Oct 2015 3:46 PM GMT


టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ లో చరణ్ ఒకడు. అఫ్ కోర్స్ మెగా ఫ్యామిలీ హీరోలందరూ స్టెప్స్ ఇరగదీస్తున్నా.. చరణ్ స్టైల్ వేరు. చెర్రీ రేంజ్ లో స్టెప్స్ వేయడం నాకు కూడా రాదని.. మరో బెస్ట్ డ్యాన్సర్ అయిన బన్నీయే ఓపెన్ గా పొగుడుతాడంటే... చరణ్ ట్యాలెంట్ అర్ధమవుతుంది.

ఇప్పుడు బ్రూస్ లీ... ఫైటర్ అయినా సరే.. డ్యాన్సుల విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సాంగ్ రన్.. లైఫంతా రేసురా రన్ అనే పాటలో.. మైండ్ బ్లోయింగ్ స్టెప్స్ తో కుమ్మేశాడు చరణ్. జస్ట్ శాంపిల్ గా చూపించిన సాంగ్ టీజర్ లలోనే భీకరమైన డ్యాన్సులు చేస్తూ కనిపిస్తున్నాడు చరణ్. ఇక మొత్తం సాంగ్ చూస్తే..థియేటర్లలలోనే డ్యాన్సులు వేయించేట్లుగా ఉన్నాడు చెర్రీ.

అసలు ఈ పాటను చాలా స్పీడ్ గా తీశారని, ఒక రోజు అయితే 17 గంటలు కంటిన్యూగా షూట్ చేశారనే విషయం.. డైరెక్టర్ శ్రీనువైట్ల చెప్పబట్టి అర్ధమైంది కానీ.. లేకపోతే.. అసలు తెలీదు మనకి. బ్రూస్ లీలో యాక్షన్, ఫైట్సే కాదు.. సూపర్ డూపర్ డ్యాన్సులు కూడా ఫ్యాన్స్ ని ఫీస్ట్ గా చెప్పేయచ్చు.