Begin typing your search above and press return to search.
వినాయక చవితికి చెర్రీ కామెడీ?!
By: Tupaki Desk | 4 Sep 2015 11:07 AM GMTరామ్‌చరణ్ తన సినిమా టేస్టుని చూపించడానికి పక్కాగా ప్లానింగ్స్ వేసుకొన్నట్టున్నాడు. ఫస్ట్ టీజర్‌లో యాక్షన్ చూపించాడు. సెకండ్ టీజర్‌లో సెంటిమెంట్‌ని చూపించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో టీజర్ తో కామెడీ యాంగిల్ ని చూపించబోతున్నాడట. ఫస్ట్ టీజర్ అంటే మాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందునా టీజర్ చిరంజీవి పుట్టినరోజున విడుదలైంది. అలాంటప్పుడు యాక్షన్ ఉండాల్సిందే, టీజర్ చూశాక చరణ్ రూపంలో చిరంజీవిని గుర్తుకు తెప్పించాల్సిందే. అందుకే తొలి టీజర్‌లో యాక్షన్‌ని మాత్రమే చూపించారు. అది ఫ్యాన్స్‌కి పిచ్చపిచ్చగా నచ్చేసింది.
పేరేమో `బ్రూస్ లీ`. అందుకు తగ్గట్టుగానే చెర్రీ యమా యాక్షన్ చేశాడు. మరి ఇలాంటి సినిమా ఫ్యామిలీకి ఎక్కుతుందా? వాళ్లకు అసలు బ్రూస్ లీ అన్న పేరు పలకడానికైనా నోరు తిరుగుతుందా? అనే కామెంట్లు వినిపించేసరికి వెంటనే మరో టీజర్‌ని వదిలాడు చెర్రీ. ఈసారి పవన్ కళ్యాణ్ బర్త్‌డే ని అకేషన్ గా చేసుకొని సినిమాలో సెంటిమెంట్ యాంగిల్ ని చూపించాడు. యాక్షనే కాదు.. సెంటిమెంట్ కూడా ఉంటుందని ప్రేక్షకులకు చెప్పకనే చెప్పాడు. ఆ రెండూ టీజర్లు చూశాక మళ్లీ ప్రేక్షకులు `శ్రీనువైట్ల మార్క్ కామెడీ సంగతేంటి? ఇందులో కామెడీ ఉండదా?` అని సందేహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ మాటలు విన్న యూనిట్ ఇప్పుడు కామెడీ యాంగిల్‌ని కూడా చూపించడానికి సిద్ధమైనట్టు సమాచారం. వినాయక చవితిని పురస్కరించుకొని `బ్రూస్ లీ` సినిమాలోని కామెడీ యాంగిల్‌ని కూడా చూపించబోతున్నట్టు సమాచారం. కోన వెంకట్, గోపీమోహన్ బ్యాచ్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అదించడం, శ్రీనువైట్ల దర్శకత్వం చేయడంతో ఇందులోనూ కామెడీ ఓ రేంజ్‌లో పేలిపోయిందట. ఆ సన్నివేశాలు మచ్చుకు కొంచెం చూపిస్తే బాగుంటుందని చిత్రబృందం ఇప్పుడు టీజర్ కటింగ్ లో నిమిగ్నమైనట్టు సమాచారం.