Begin typing your search above and press return to search.
పాతబస్తీలో బ్రూస్లీకి పనేంటి?
By: Tupaki Desk | 3 Sep 2015 6:34 AM GMTరామ్‌చరణ్ ఫైటర్ గా నటిస్తున్నాడు. పైగా తోటి ఫైటర్లంతా బ్రూస్లీ అంటూ పిలుచుకుంటారు. యాక్షనే యాక్షన్. చెర్రీ కెరీర్ లోనే స్పెషల్ స్టంట్స్ చూడబోతున్నారు అంటూ చిత్రయూనిట్ ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రచారం మాటేమో గానీ, చరణ్ అభిమానుల్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోతోంది. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ స్టంట్స్ లాంటివి తెలుగు సినిమాల్లోనూ చూడాలన్న తహతహ ఎప్పట్నుంచో ఉన్నదే అయినా మనవాళ్లెవరూ అలా చూపించలేకపోయారు.
యాక్షన్ జోనర్ సరిగ్గా క్లిక్కయితే బ్లాక్ బస్టర్లు, రికార్డులే. అది చెర్రీ -వైట్ల కలయికలో సాధ్యమైతే మంచిదే. ఇప్పటి కైతే శ్రీమంతుడు పేరిట 150కోట్ల రికార్డు సుస్థిరం అయిపోయింది. దాన్ని కొట్టాలంటే టీజర్ల తో పెంచిన హైప్ సినిమాలో కూడా కనిపిస్తే సరిపోతుంది. ప్రస్తుతం యూనిట్ పాత బస్తీలో జోరుగా షూటింగులు చేస్తోంది. చరణ్ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెన్స్ 20శాతం షూటింగ్ పూర్తి చేసి, దసరా బరిలో దిగిపోవాలన్నది ప్లాన్. కొడ్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాలి. చెర్రీ ఆ రేంజులోనే కొట్టేస్తాడేమో చూడాలి. 600కోట్లు, 150 కోట్లు ఈ రెండిటిలో ఒక్క రికార్డును కొట్టాలన్నా బ్రూస్లీ కథ, కంటెంట్ లో బోలెడంత విషయం ఉండాల్సిందే.
శ్రీనూ ఈసారి కోన, గోపీతో కలిసి పనిచేస్తున్నాడు కాబట్టి ఏ మ్యాజిక్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. శ్రీమంతుడు ప్రభావం అన్నిటిపైనే పడింది. ఆ రకంగా చరణ్ కి ఇది కలిసొచ్చే సందర్భమే. అయితే దసరాకు ఈ సినిమా వస్తుందా రాదా అనే సందేహం మాత్రం అందరికీ ఉంది.