Begin typing your search above and press return to search.

ర్యాంబో లుక్ వెన‌క క‌ఠోర శ్ర‌మ

By:  Tupaki Desk   |   2 Jan 2019 4:34 AM GMT
ర్యాంబో లుక్ వెన‌క క‌ఠోర శ్ర‌మ
X
బైసెప్.. ట్రైసెప్.. కండ‌లు మెలితిరిగిన దేహం.. ఆ బాడీపై ప‌చ్చ‌బొట్లు .. ఇదీ రామ్ చ‌ర‌ణ్ న్యూ గెట‌ప్. `విన‌య విధేయ రామ‌` పోస్ట‌ర్ల‌లో చ‌ర‌ణ్ లుక్ భీక‌రం.. చూడ‌టానికి అచ్చం ర్యాంబోలా క‌నిపించాడు. 1982 `ఫ‌స్ట్ బ్ల‌డ్` సినిమానే చూపించాడు చెర్రీ. ఆ సినిమాలో విరోచిత పోరాటాల‌తో చెల‌రేగిపోయిన సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ లుక్ కూడా ఇంత భీక‌రంగా లేదేమో అన్నంత‌గా మేకోవ‌ర్ చూపించాడు చ‌ర‌ణ్. దీంతో పాటు ప‌చ్చ‌బొట్ల‌తో కిరాక్ పుట్టించాడు చెర్రీ..

అయితే ఈ లుక్ రావ‌డం అంత వీజీనా? అంటే అంత సులువేం కాదు. అహోరాత్రులు ఎంతో నియ‌మ‌నిష్ఠ‌ల‌తో, క‌ఠిన త‌ప‌స్సు చేస్తేనే ఈ గెట‌ప్ సాధ్యం. బాలీవుడ్ మ్యాకో మ్యాన్ హృతిక్ రోష‌న్ రోజూ 4గంట‌లు జిమ్‌ లోనే ఉంటాడు అంటే అంద‌రూ షాక్ తిన్నారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ అంతే క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నారు. పైగా ఆహారం ఏది ప‌డితే అది తినేస్తే కుద‌రదు. పెర్ఫెక్ట్ డైట్ ప్లాన్ ఇంపార్టెంట్. ఓ సుశిక్షితుడైన కోచ్ సార‌థ్యంలో చ‌ర‌ణ్ కొన్నేళ్లుగా ఎంతో క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాడు. ఇంట్లోనే ఎంతో నాణ్య‌మైన జిమ్ ఉంది. నిపుణుడైన కోచ్ సాయంతోనే ఇది సాధ్య‌మ‌వుతోంది.

ధృవ సినిమా కోసం చ‌ర‌ణ్ క‌ఠోర త‌ప‌స్సు చేశాడు. ఆ త‌ర్వాత ఇంకా ఇంకా బాడీని గ్రేట్ మ్యాకో లుక్ త‌ర‌హాలోకి మార్చేశాడు. బాలీవుడ్‌ లో స‌ల్మాన్ ఖాన్, హృతిక్ రోష‌న్, టైగ‌ర్ ష్రాఫ్ వంటి టాప్ స్టార్ల స్ఫూర్తితో ఈ లుక్ ని ఛేంజ్ చేసిన చ‌ర‌ణ్ మునుముందు మ‌రిన్ని సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సార‌థ్యంలో ర‌న్ అవుతున్న అపోలో- హెల్త్ మ్యాగ‌జైన్ బీ పాజిటివ్‌ లేటెస్ట్ క‌వ‌ర్ పేజీపై చ‌రణ్ ఇలా క‌స‌ర‌త్తులు చేస్తున్న ఫోటోని ముద్రించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈనెల 11న విధేయ రాముని ఆగ‌మం గురించి తెలిసిందే.