Begin typing your search above and press return to search.

రాత్రి అక్కడ పగులు ఇక్కడ.. చరణ్‌ బిజీ బిజీ

By:  Tupaki Desk   |   20 Jan 2021 3:53 PM GMT
రాత్రి అక్కడ పగులు ఇక్కడ.. చరణ్‌ బిజీ బిజీ
X
మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. కొరటాల శివ తమ సినిమాలో సిద్ద పాత్రను చరణ్‌ చేస్తున్నాడు. షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడంటూ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. కొరటాల శివ ఆ విషయాన్ని షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే రాజమౌళి తమ ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ చిత్రీకరిస్తున్నాం. రామరాజు మరియు భీమ్ లు ఇద్దరు కలిశారు అంటూ అధికారికంగా సోషల్‌ మీడియాలో తెలియజేశారు. కొన్ని నెలలుగా ఖాళీగానే ఉంటూ వచ్చిన చరణ్ ఉన్నట్లుండి బిజీ అయ్యాడు. ఒకేసారి రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నాడు.

ఒక్క రోజులో ఈ రెండు సినిమాల షూటింగ్‌ లో కూడా చరణ్‌ పాల్గొంటున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగ్ లను ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నాడు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఒక సినిమా షూటింగ్ డే టైమ్‌ లో జరుగుతుండగా మరో సినిమా షూటింగ్ నైట్ టైమ్‌ లో జరుగుతుంది. కనుక రెండు సినిమా షూటింగ్ లను అలా మేనేజ్‌ చేస్తున్నాడని అంటున్నారు. ఆచార్య సినిమా షూటింగ్‌ మరో వారం పది రోజుల్లోనే చరణ్‌ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పూర్తిగా ఆర్‌ఆర్‌ఆర్‌ పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.