Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' లో తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్న చరణ్..!

By:  Tupaki Desk   |   19 April 2020 7:30 AM GMT
ఆర్.ఆర్.ఆర్ లో తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్న చరణ్..!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'కొమరం భీమ్' పాత్రలో కనిపిస్తుండగా చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. నటన పరంగా 'రంగస్థలం'లో చరణ్ యాక్టింగ్ ఆయన కెరీర్లోనే బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ మౌల్డ్ అయిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. వాస్తవానికి చరణ్ యాక్టింగ్ లో ఫస్ట్ నుండి సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూనే వస్తున్నాడని చెప్పవచ్చు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' లో కూడా రంగస్థలం సినిమాకి మించి తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన వీడియోలో చరణ్ సాలిడ్ బాడీతో సాలిడ్ గా కనిపించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా చూపించిన రౌద్రం ఈ ఒక్క చిన్న వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తున్నాడు చెర్రీ అని ఇప్పటికే ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర కావడంతో నటనకు ఇంకా స్కోప్ లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రామ్ చరణ్ వీర లెవల్లో నటించాడట. ఇప్పటికే 70 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో చరణ్ యాక్టింగ్ చూసిన యూనిట్ సభ్యులు రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇదేనని కొనియాడుతున్నారట. అంతేకాకుండా మరోవైపు ఎన్టీఆర్ కూడా తన నటవిశ్వరూపాన్ని మరోసారి చూపిస్తున్నాడట. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొనియున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.