Begin typing your search above and press return to search.

హ్యాపీ బ‌ర్త్ డే అప్పా.. చ‌ర‌ణ్ విషెస్

By:  Tupaki Desk   |   22 Aug 2019 5:05 AM GMT
హ్యాపీ బ‌ర్త్ డే అప్పా.. చ‌ర‌ణ్ విషెస్
X
మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌లు నిన్న‌టి(బుధ‌వారం) సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా పొరుగు రాష్ట్రాలు.. విదేశాల నుంచి మెగాభిమానులు భారీగా విచ్చేశారు. వేలాది మంది ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిధిగా బ‌ర్త్ డే కేక్ ని క‌ట్ చేశారు. ఈ వేడుక‌లో అల్లు అర‌వింద్- సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ అతిధులుగా క‌నిపించారు. వారం ముందు నుంచే మెగాభిమానులు అన్న‌య్య పుట్టిన‌రోజు సంబ‌రాల్ని ప్రారంభించారు. నేడు చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా హైద‌రాబాద్ బ్ల‌డ్ బ్యాంక్ వ‌ద్ద ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలు వ‌గైరా య‌థాత‌థంగా జ‌రుగుతున్నాయి.

మునుప‌టితో పోలిస్తే ఈసారి బ‌ర్త్ డే ఎంతో ప్ర‌త్యేకం. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న భారీ హిస్టారిక‌ల్ చిత్రం `సైరా-న‌ర‌సింహారెడ్డి` అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా మెగాభిమానులు `సైరా` ప్ర‌చారాన్ని త‌మ‌వంతు బాధ్య‌త‌గా హోరెత్తిస్తున్నారు. అన్న‌య్య న‌టించిన సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని పూజ‌లు పున‌స్కారాలు చేస్తున్నారు. నేడు బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిరుత‌న‌యుడు.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ విషెస్ తెలియ‌జేశారు.

``మీరు ల‌క్ష‌లాది మందికి స్ఫూర్తి.. మెంటార్.. ఒక మార్గ‌ద‌ర్శ‌కుడు. స్ఫూర్తి పొందే మిలియ‌న్ అభిమానుల్లో నేను ఒక‌డిని. వాళ్లంతా `మెగాస్టార్` అని పిలుస్తారు. నేను `అప్పా` అని పిలుస్తాను. నేడు అప్పా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. మీరు ఎప్ప‌టికీ ఇలానే మాలో స్ఫూర్తిని నింపుతూ ఉండాలి. మీపై ఎంతో ప్రేమ‌తో... హ్యాపి బ‌ర్త్ డే మెగాస్టార్ చిరంజీవి`` అని సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర‌ణ్ విషెస్ తెలిపారు. చిరు బ‌ర్త్ డేకి రెండ్రోజుల ముందే `సైరా` టీజ‌ర్ రిలీజై యూట్యూబ్ లో దూసుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సుమారు రెండు కోట్ల మంది వీక్షించారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా సైరా చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.