Begin typing your search above and press return to search.
దోస్త్ మేరా దోస్త్.. శర్వా బర్త్ డే పార్టీలో చెర్రీ
By: Tupaki Desk | 6 March 2021 5:32 AM GMTపరిశ్రమ స్నేహాల గురించి సామాన్యులకు తెలిసింది తక్కువే. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలుగుతున్నారు. సాటి హీరోలకు అవసరం మేర ప్రమోషన్ సాయం చేస్తున్నారు. ఒకరి ఫ్యామిలీ ఈవెంట్ కి ఇంకొకరు వెళ్లడం చూస్తున్నదే. ఇకపోతే చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న హీరోల గురించి అభిమానులకు తెలిసే దాని కంటే తెలియనిదే ఎక్కువ.
కలిసి ఒకే స్కూల్ లో పాఠాలు చదువుకోవడం నుంచి కలిసే పార్టీలకు వెళ్లడం లాంటివి చాలా విషయాలు బయటికి తెలీనివి ఉంటాయి. కానీ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. వెర్సటైల్ స్టార్ శర్వానంద్ స్నేహం గురించి అభిమానులకు చాలాకాలంగా తెలుసు. ఆ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. శర్వానంద్ చెర్రీకి ఫ్యామిలీ ఫ్రెండ్. నిరంతరం కలుస్తుంటారు. ఒకరి ఈవెంట్లకు ఒకరు సహకారులుగా ఉంటారు. కలిసి కథలు వింటారు. ఇక కెరీర్ పరంగానూ శర్వాకి మెగాశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. కానీ అతడు తన కాళ్లపై తాను నిలబడాలని ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. ఇప్పటికి స్టార్ గా నిరూపించుకుని కెరీర్ పరంగా ముందుకు సాగిపోతున్నాడు.
స్నేహితుడు శర్వా అంటే చరణ్ కి ఎంత అభిమానమో చెప్పేందుకు ఈ ఫోటోనే సాక్ష్యం. నేడు (06 మార్చి) శర్వా బర్త్ డే సందర్భంగా చరణ్ స్వయంగా తనని కలిసి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. దగ్గరుండి మరీ కేక్ కటింగ్ చేయించారు. శర్వానంద్ నటించిన శ్రీకారం మార్చి 11న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దీనికి చెర్రీ పబ్లిసిటీ అదనపు అస్సెట్ కానుంది. అలాగే చరణ్ వరుస సినిమాలతో బిజీ. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో పాల్గొంటూనే ఇటీవల ఆచార్యలో తన టాకీ పార్ట్ ని పూర్తి చేశాడు. మధ్యలో ఇలా స్నేహితుల్ని పలకరించేస్తున్నాడు. పార్టీల్లో పాల్గొంటున్నాడు. గ్రేట్ చెర్రీ.