Begin typing your search above and press return to search.
‘బ్రూస్ లీ’ దెబ్బ గట్టిగానే తగిలినట్లుందే..
By: Tupaki Desk | 27 March 2018 5:59 PM GMTటాలీవుడ్లో చాలామంది హీరోలు కొన్నేళ్ల కిందటి వరకు రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తున్న వాళ్లే. కానీ ప్రేక్షకుల అభిరుచి మారుతున్నా వాటినే పట్టుకుని వేలాడటంతో గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు. ఈ కోవలో చాలా లేటుగా స్పందించిన హీరో రామ్ చరణ్. అతను ఒకప్పుడు రొడ్డకొట్టుడు మాస్ మసాలా సినిమాలు చేశాడు. ఐతే ‘బ్రూస్ లీ’ దెబ్బతో అతడిలోనూ మార్పు వచ్చింది. ఆ తర్వాత ‘ధృవ’ లాంటి వైవిధ్యమైన సినిమా చేశాడు. ఇప్పుడు ‘రంగస్థలం’ లాంటి మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దీంతో చరణ్ మీద క్లాస్ ఆడియన్స్ అభిప్రాయం మారింది. ఇప్పుడు తనలో వచ్చిన మార్పుకు ‘బ్రూస్ లీ’నే కారణమంటూ చరణ్ స్వయంగా చెబుతుండటం విశేషం.
‘రంగస్థలం’ ప్రమోషన్లలో భాగంగా.. ఐదేళ్ల ముందు ఇదే కథ చెబితే సినిమా చేసేవారా అని చరణ్ ను అడిగితే మొహమాటం లేకుండా లేదని చెప్పేశాడు. ‘‘రంగస్థలంలో హీరో చెవిటివాడు. అలాంటి పాత్రను ఇంతకుముందు చెబితే అంత సాహసం చేసేవాడిని కాదేమో. ఈ మధ్య నా మైండ్ సెట్ మారుతోంది. కరెక్టుగా చెప్పాలంటే ‘బ్రూస్ లీ’ తర్వాతే నా ఆలోచన మారింది. ఆ మార్పులోంచే ‘ధృవ’ వచ్చింది. దీని తర్వాత ఇంకా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నపుడు ‘రంగస్థలం’ వచ్చింది. నేను సినీ పరిశ్రమకు వచ్చి పదేళ్లయింది. ఇప్పుడు నాకు ఇంకా ఏమా కొత్తగా చేయాలి.. మంచి పాత్రల్లో కనిపించాలనే కోరిక బలంగా కలుగుతోంది. ఆ క్రమంలోనే ‘రంగస్థలం’ చేశాను. ఇకపైనా ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేస్తాను’’ అని చరణ్ తెలిపాడు.