Begin typing your search above and press return to search.

చరణ్‌ కోసం రూటు మార్చిన శీను

By:  Tupaki Desk   |   20 Jan 2015 3:23 PM GMT
చరణ్‌ కోసం రూటు మార్చిన శీను
X
టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శ్రీనువైట్ల సినిమా అనగానే కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అతడి జోనర్‌ కామెడీ. కడుపుబ్బా నవ్వించడం. ప్రతి సన్నివేశంలో నవ్వించడం అన్నదే అతడి ఫార్ములా. అందుకు తగ్గట్టే ఇంతకాలం సినిమాలు తెరకెక్కించి విజయాలు అందుకున్నాడు.

ఆనందం, దుబాయ్‌శీను, దూకుడు, బాద్‌షా అన్నీ కామెడీ ఎంటర్‌టైనర్‌లే. యాక్షన్‌ మేళవించి కామెడీ చేయించడం శ్రీను ప్రత్యేకత. ఈ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. అయితే మహేష్‌ హీరోగా తెరకెక్కించిన ఆగడు మాత్రం పెద్ద ఝలక్‌ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. దాంతో ఇప్పుడు చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న 'మై నేమ్‌ ఈజ్‌ రాజు' చిత్రం విషయంలో శ్రీను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి రొటీన్‌ భిన్నంగా కొత్త పంథా కథ రాసుకున్నాడని సమాచారం. రొటీన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌లా కాకుండా కామెడీ ఉంటూనే థ్రిల్లర్‌ పంథాలో సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కామెడీలోనూ రొటీనిటీ లేకుండా నవ్యపంథాలో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట.

చరణ్‌ ఈ చిత్రంలో ఓ బైక్‌ రేసర్‌. రాజు అనే బైక్‌ రేసర్‌ జీవితం ఎలా సాగింది? అన్నదే సినిమా. సమంత ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే ఫార్ములాలో సినిమా తీస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఆగడుతో తెలిసింది కాబట్టి శ్రీనులో ఈ మార్పు వచ్చిందని అంటున్నారంతా