Begin typing your search above and press return to search.

కలర్ఫుల్ గా చరణ్ లుక్

By:  Tupaki Desk   |   20 Jan 2018 5:18 AM GMT
కలర్ఫుల్ గా చరణ్ లుక్
X
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను తీస్తే కిక్కు ఏం ఉంటుంది. అప్పుడపుడు కొత్తగా ప్రయత్నాలు చేస్తేనే సంతృప్తిగా ఉంటుంది. దర్శకుడు అయినా సినిమా హీరో అయినా ఎప్పుడు కొత్త ప్రయత్నాలు చేయాలనే అనుకుంటారు. ఎంతవరకు సక్సెస్ అవుతారనేది తరువాత విషయం ముందు ప్రయోగం కోసం ప్రయత్నం చేశామా అన్నదే ముఖ్యం. ఇప్పుడు రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ కూడా కొత్త కలర్ కోసం పాతరోజుల్లోకి వెళుతోంది.

రంగస్థలం సినిమా షూటింగ్ ఇప్పటికే ఎండింగ్ కు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో మిగిలి ఉన్న కొసరు వర్క్ కూడా పూర్తవుతుంది. అయితే సినిమాకు సంబందించిన ఫొటోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన మరొక ఫొటో కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది. గ్రామాల్లో ఉండే యువకులు ఆ 1980లలో ఎలా ఉండేవారో అలా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు.

రీసెంట్ గా ఒక గ్రామంలో జరిగిన షూటింగ్ స్పాట్ లో ఓ అభిమాని తీసిన ఆ పోటో నెటిజన్స్ ని చాలా ఆకట్టుకుంటోంది. ఎర్ర చొక్కా - లుంగీలో చరణ్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఆయనని చూడటానికి వచ్చిన అభిమానులకు కూడా హాయ్ చెప్పడం చూసి మంచి హీరో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫొటోలో ఆ కాలం చెక్కలతో ఉండే ఎండ్లబండి కూడా కనిపిస్తోంది. ఎడ్లు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి దర్శకుడు సినిమా కోసం ఏ స్థాయిలో శ్రద్ధ తీసుకుంటున్నాడో అర్ధం చేసుకోవచ్చు.