Begin typing your search above and press return to search.
హాలీవుడ్ ఎంట్రీపై రామ్ చరణ్ కామెంట్
By: Tupaki Desk | 27 Feb 2023 9:41 AM GMTఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అతన్ని గ్లోబల్ స్టార్ అంటూ కీర్తిస్తున్నారు. ఇక తాజాగా హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ లో బెస్ట్ యాక్టర్ అవార్డుని రామ్ చరణ్ అందుకున్నాడు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా పలు విభాగాలలో అవార్డులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ అవార్డుల వేడుక తర్వాత హాలీవుడ్ నిర్మాత సంస్థలు అతనితో కనెక్ట్ అయినట్లు తెలుస్తుంది.
లాస్ ఏంజిల్స్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్ లో ఆయన హాలీవుడ్ నిర్మాతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంపై అతనితో చర్చించడంతో పాటు నిర్మాణ భాగస్వామ్యం లేదా హాలీవుడ్ సినిమాలలో చేయడంపై రామ్ చరణ్ తో ప్రశ్నలు వేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ కూడా హాలీవుడ్ సినిమాలు చేసే విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఇండియాలో కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత హాలీవుడ్ సినిమా చేసే విషయంపై దృష్టి పెడతానని చెప్పారు.
కచ్చితంగా హాలీవుడ్ డెబ్యూ చేయాలని ఉంటుందని అయితే ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ కమిటై ఉండటం వలన కొంత సమయం పడుతుందని మాత్రం రామ్ చరణ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. అలాగే కన్నడ యంగ్ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో ఒక యాక్షన్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దీనిని పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత మాత్రమే రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి ఈ ప్రొడ్యూసర్ గిల్డ్ మీటింగ్ లో ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.