Begin typing your search above and press return to search.
అది ఉండదని రామ్ చరణే చెప్పేశాడు
By: Tupaki Desk | 3 Nov 2016 5:30 PM GMTరామ్ చరణ్ కొత్త సినిమా ‘ధృవ’ విషయంలో కొన్నాళ్లుగా అనుమానిస్తున్నట్లే జరిగింది. ఈ సినిమాకు ఆడియో వేడుక ఉండదని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణే ప్రకటించాడు. ‘ధృవ’కు ఆడియో వేడుక చేయకుండా నేరుగా ఈ నెల 9న మార్కెట్లోకి ఆడియోను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు రామ్ చరణ్. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘గీతా ఆర్ట్స్’లో వచ్చిన గత సినిమా ‘సరైనోడు’ విషయంలోనూ ఇలాగే చేశారు. నేరుగా ఆడియోను మార్కెట్లోకి వదిలేసి.. ఆ తర్వాత విశాఖపట్నంలో ప్రి రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు.
‘ధృవ’కు కూడా అదే రీతిలో విజయవాడలో ప్రి రిలీజ్ వేడుక చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మెగా అభిమానులు పెద్దగా ఫీలవ్వాల్సిన పని లేదు. ప్రి రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తాడట. ఇక ‘ధృవ’ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తి చేసేశారు. పాటల చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఆడియో విడుదల సమయానికే షూటింగ్ పార్ట్ పూర్తయిపోతుంది. డిసెంబరు 2న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. అరవింద్ స్వామి విలన్. ఒరిజనల్ కు సంగీతాన్నందించిన హిప్ హాప్ తమిళనే ఈ చిత్రానికీ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోలో నాలుగు పాటలు మాత్రమే ఉంటాయని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/