Begin typing your search above and press return to search.
తండ్రిని కాదని సుక్కూకి చెర్రీ సపోర్ట్
By: Tupaki Desk | 30 Jan 2018 9:56 AM GMTమెగా కుటుంబంలో చిరుని కాదని ఏదీ జరగదు. చెర్రీ సినిమాల విషయంలో చిరుదే చివరి నిర్ణయం. కథను కూడా తానే ముందు విని ఓకే చేస్తాడని, రంగస్థలం కధను కూడా ముందు తండ్రి విన్నాకే కొడుకు చెవిని చేరిందని అంటారు సినీ జనాలు. చిరు ఓకే చెప్పాకే చెర్రీ కూడా ఓకే చెబుతాడని, ఆ తండ్రీ కొడుకులది ఒకే మాటని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ విషయంలో మాత్రం చెర్రీ తండ్రిని వ్యతిరేకించాడు.
రంగస్థలం 1985... విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే రొమాంటిక్ ఎంటర్ టైనర్. దాని షూటింగ్ పూర్తయినట్టే. ఆ సినిమా రషెస్ ను ఇటీవల చూశారట చిరంజీవి. కొన్ని సీన్లు ఆయనకు నచ్చలేదట. దాంతో రీషూట్ చేయమని చెప్పారట టీమ్ కు. దాంతో సుకుమార్ చాలా సందిగ్ధంలో పడిపోయాడట. ఆ పరిస్థితిలో చెర్రీ సుక్కూ అండగా నిలబడి తండ్రితో మాట్లాడాడని అంటున్నారు సినీజనాలు. సుకుమార్ సినిమాలు బాగా తీస్తాడని, అతడిని కావాల్సినంత స్వేచ్ఛ ఇద్దామని కన్విన్స్ చేశారట. కొడుకు మాటలకు తండ్రి కూడా సరేలే అనేశారట.
రంగస్థలం సినిమాను మొదట మార్చి 29న రిలీజ్ అన్నారు. ఇప్పుడు మార్చి 30న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇందులో చిట్టిబాబుగా చేసిన చెర్రీ చెవిటివాడిగా కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.