Begin typing your search above and press return to search.
ఎనిమిదో వార్షికోత్సవం వేళ మెగా కోడలులో వేదన
By: Tupaki Desk | 21 Jun 2020 3:45 AM GMTఏడవ వార్షికోత్సవం సందర్భంగా భార్య ఉపాసనకు చెర్రీ ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేశారో తెలిసిందే. రామ్ చరణ్ - ఉపసన జంట గత ఏడాది వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీతో టైమ్ స్పెండ్ చేశారు. ఉపాసనకు మెమరబుల్ గిఫ్ట్ అది. అయితే ఈ ఏడాది జూన్ 14 వచ్చేసింది. అయినా సెలబ్రేషన్ వివరాలేవీ బయటకు రాలేదు. ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం ఎలా జరుపుకున్నారు? ఈ ప్రశ్నకు ఇన్నాళ్లు సమాధానం లేక అభిమానులు ఖంగు తిన్నారు.
అయితే జూన్ 14 న ఈసారి ఎలాంటి స్పెషల్ లేదని ఉపాసన తెలిపారు. పైగా ఈ ఏడాది అలాంటి మూడ్ లో లేమని కూడా వెల్లడించారు. దానికి కారణాన్ని చెప్పారు. ``2020 బ్యాడ్ ఇయర్. ఇంట్లో ముగ్గురు పెద్దవాళ్లను పోగొట్టుకున్నాం. ప్రస్తుత కరోనా విలయం కలచివేస్తోంది. 20 రోజులుగా ఎన్నో చూశాం.
సుశాంత్ సింగ్ మరణం గురించి విన్నాం. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. మన దేశాన్ని కాపాడేందుకు వీర జవాన్లు అమరులయ్యారు. వీటిని ఎదుర్కోవడం సులువేం కాదు. ఎంతో మానసిక వేదనకు గురయ్యాం. అందుకే వేడుకగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుకో లేకపోయాం`` అని తెలిపారు.
వేడుక జరుపుకోకపోయినా ఆ రోజు ఇంట్లోనే ఉండి టీవీ చూస్తూ గడిపేశారట. మూడు రకాల ఆవకాయ పచ్చళ్ల తో అన్నం.. చిప్స్ మాత్రమే తిన్నామని తెలిపారు. గతించిన ఈ కొద్ది కాలం లో జీవితానికి కావాల్సిన ఎన్నో పాఠాల్ని నేర్చుకున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉపాసన షేర్ చేసిన ఫోటోలో ఆవకాయతో కలిపిన అన్నం షేర్ చేశారు. చిప్ప్.. ఫోన్.. టీవీ రిమోట్ సహా కొన్ని జంతువుల ఫోటోలు ఉన్నాయి. ``ఫొటోలోని ఒక్కో వస్తువు తమ ఇంట ఉన్న ఒక్కో కొత్త విషయాన్ని వెల్లడిస్తాయి`` అని ఉపాసన గుంబనగా బయటకు తెలీని ఏదో ఓ కొత్త రహస్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.