Begin typing your search above and press return to search.
'సైరా' డెడ్ లైన్.. సూరిపై ఒత్తిడి!
By: Tupaki Desk | 31 March 2019 7:58 AM GMT2019-20 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా `సైరా-నరసింహారెడ్డి` పాపులరైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెలుగు- తమిళం- హిందీ- కన్నడ స్టార్లతో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 150-200 కోట్ల మేర పెట్టుబడుల్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సమకూరుస్తోందని ప్రచారమైంది. ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో రాయలసీమకు చెందిన ఒక పోరాట యోధుడి కథను తెరపై ఆవిష్కరించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి - సురేందర్ రెడ్డి బృందం ఏడాది కాలంగా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అన్నదానిపై సరైన క్లారిటీ రాలేదింకా.
ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలన్న ప్లాన్ తోనే ఆరంభం చిత్రీకరణ ప్రారంభించారు. కానీ విజువల్ గ్రాఫిక్స్ తో ముడిపడిన భారీ చిత్రం కావడంతో ఇప్పుడే రిలీజ్ చేయలేమని మేకర్స్ ప్రకటించారు. ఈ ఆగస్టులో రిలీజ్ కి ప్రయత్నిస్తున్నారని ప్రచారమైంది. అయితే అప్పుడైనా రిలీజవుతుందా? అంటే కష్టమేనని మధ్యలో మరో కొత్త ప్రచారం వేడెక్కించింది.
తాజా సమచారం ప్రకారం `సైరా` చిత్రాన్ని ఆగస్టులోనే రిలీజ్ చేయాలన్న పంతంతో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఉందని తెలుస్తోంది. సాధ్యమైనంత తొందరగా సినిమాని పూర్తి చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి (సూరి) పైనా ఒత్తిడి పెంచారట. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగలిగితే సముచితంగా ఉంటుందని చరణ్ బృందం భావిస్తున్నారట. ఆ క్రమంలోనే మే 5 నాటికి సినిమాని పూర్తి చేయాల్సిందిగా సూరికి డెడ్ లైన్ విధించారని చెబుతున్నారు. ఏప్రిల్ 2 నాటికి హైదరాబాద్ కోకాపేటలో కీలక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తవుతోంది. అటుపై ఏప్రిల్ 9 వరకూ చైనా లేదా మధ్య ప్రదేశ్ లో వారంపాటు చిత్రీకరణ సాగుతుందట. ఆ మేరకు కొత్త షెడ్యూల్ ని ఖరారు చేశారట. ఆగస్టు నాటికి ఈ సినిమా రిలీజవుతుందా లేదా? అన్నది అటుంచితే దసరా బరిలో అయినా రిలీజ్ చేయాలన్న ఆలోచన ఉందని చెబుతున్నారు. మరోవైపు 2020 సంక్రాంతికే సైరా రిలీజ్ కి ఛాన్సుంటుందన్న విశ్లేషణ ట్రేడ్ లో సాగుతున్న సంగతి తెలిసిందే.