Begin typing your search above and press return to search.

డిస్నీతో రామ్ చరణ్ డీల్ ఏమై ఉంటుంద‌బ్బా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 6:38 AM GMT
డిస్నీతో రామ్ చరణ్ డీల్ ఏమై ఉంటుంద‌బ్బా?
X
ప్ర‌తిరోజు.. ప్ర‌తి నిమిషం.. ప్ర‌తి సెక‌ను డీల్స్ ఎలా కుదుర్చుకోవాలో తెలిసిన వాడే రియ‌ల్ బిజినెస్ మేన్ కం ఎంట‌ర్ ప్రెన్యూర్. ఒక్కో డీల్ సెట్టింగ్ విలువ కోట్లు కొల్ల‌గొట్టే అవ‌కాశం కిందే లెక్క‌. వినోద రంగంలో ఇందుకు పెద్ద అవ‌కాశం ఉంది. జాతీయ అంత‌ర్జాతీయ దిగ్గ‌జాల‌తో క‌లిసి భారీ డీల్స్ కుదుర్చుకుంటూ ఇటీవ‌ల స్టార్ ప్రొడ్యూస‌ర్స్ .. డైరెక్ట‌ర్స్ .. స్టార్ హీరోలు భారీ కాంట్రాక్టుల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

ప్ర‌ఖ్యాత ఏషియ‌న్ సినిమాస్ తో టై అప్ లో మ‌హేష్‌.. అల్లు అర్జున్ థియేట‌ర్ చైన్ బిజినెస్ ని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రికీ భిన్నంగా రామ్ చ‌ర‌ణ్ ఆలోచిస్తున్నారు. అత‌డు చిన్న న‌గ‌రాల‌కు ప్ర‌యాణించే జెట్ విమానాల బిజినెస్ లో పెట్టుబ‌డులు పెట్టార‌ని ప్ర‌చార‌మైంది.

తాజాగా చ‌ర‌ణ్ ఓ కొత్త డీల్ చేసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇది పూర్తిగా కొత్త‌ది భిన్న‌మైన‌ది. తాజా స‌మాచారం మేర‌కు.. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ తెలుగు వెర్షన్ బ్రాండ్ అంబాసిడర్ గా చేరడానికి మెగా హీరో రామ్ చరణ్ సంసిద్ధంగా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చెర్రీతో ఇప్ప‌టికే స‌ద‌రు సంస్థ డీల్ మాట్లాడుతోంద‌ట‌. ఓ రెండు వీడియో ప్ర‌క‌ట‌న‌లు ప్రింట్ యాడ్స్ లో చ‌ర‌ణ్ న‌టిస్తే అందుకు 3కోట్ల మేర పారితోషికం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంటోంద‌ని స‌మాచారం. ఏడాది కాంట్రాక్టు కుదురుతోంద‌ట‌. చెర్రీ బ‌రిలో దిగితే ఇక అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. ఆహాల‌కు ధీటుగా తెలుగులోనూ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కి ఇమేజ్ అమాంతం పెరుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను పెంచుకోవాలంటే ఆమాత్రం పెట్టుబ‌డులు త‌ప్ప‌దని ఊహిస్తున్నారు.

కార్పొరెట్ ఓటీటీ న‌డుమ ఇటీవ‌ల తీవ్ర‌మైన పోటీ ఉంది. నెట్ ఫ్లిక్స్ కూడా అమెజాన్ ప్రైమ్ కి ధీటుగా తెలుగు కంటెంట్ ని అందించేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. ఆ రెండిటికీ అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. తెలుగునాట స‌బ్ స్క్రైబ‌ర్లు పెరిగారు. అలాగే వీటితో పోటీప‌డేందుకు హాట్‌స్టార్ ప్ర‌య‌త్నాల్లో ఉంది. ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లు చలనచిత్రాలు సహా అనేక తెలుగు ఒరిజినల్స్ రూపొందించడంపై దృష్టి సారించింది.

ఆర్.ఆర్.ఆర్ విడుదల చేస్తున్న సమయంలోనే శంక‌ర్ తో ఆర్.సి 15ని ప్రారంభించారు చ‌ర‌ణ్‌. అందుకే ఇప్పుడు అన్ని క‌ళ్లు అత‌డిపైనే ఉన్నాయి. చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకోవ‌డం వెన‌క పెద్ద వ్యూహం ఉంద‌ని చెబుతున్నారు. పూర్తిగా తెలుగు ఆడియెన్ ని త‌న‌వైపు తిప్పేసుకోవాల‌ని హాట్ స్టార్ వ్యూహం అని అర్థం చేసుకోవ‌చ్చు. చ‌ర‌ణ్ కి ఉన్న అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఇక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ పైనా దృష్టి సారిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

గేమ్ ఛేంజ‌ర్ గా మారుతున్న చెర్రీ

RRR -RC 15 చిత్రాల‌తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న‌ని తాను ఎదురేలేని పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్క‌రించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ధృవ‌- రంగ‌స్థ‌లం అసాధార‌ణ విజయాల‌తో అత‌డి రేంజు మారింది. ఇప్పుడు రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ .. శంక‌ర్ - ఆర్.సి 15 చిత్రాల‌తో అత‌డి స్థాయి యూనివ‌ర్శ‌ల్ రేంజుకు చేరుతుంది. పాన్ ఇండియా.. పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ల‌ను ఛేజ్ చేసే పూర్తి అర్హ‌త‌ను చ‌ర‌ణ్ సాధిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో అత‌డితో స‌త్సంబంధాల‌ను కొన‌సాగించే తెలివైన ఎత్తుగ‌డ‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కొన‌సాగిస్తోంది. ఇది పెద్ద రేంజులో క‌లిసొస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.