Begin typing your search above and press return to search.
నిర్మాత చెర్రీని మార్చేసిన బాహుబలి2
By: Tupaki Desk | 4 May 2017 5:37 AM GMTటాలీవుడ్ కే కాదు.. యావత్ భారతానికే బాహుబలి ది కంక్లూజన్ మూవీ తలమానికం అయిపోయిందనడంలో సందేహం లేదు. సరిగ్గా ప్రమోషన్స్ చేయగలిగితే.. ఇండియన్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూపిందీ సినిమా. రీసెంట్ గా ఈ చిత్రాన్ని లార్జ్ స్క్రీన్ లో చూశారు మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్.
నిర్మాతగా రామ్ చరణ్ తొలి సినిమా ఖైదీ నంబర్ 150తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. బడ్జెట్ విషయంలో కంట్రోల్ లో ఉంటూనే.. తిరుగులేని విజయం సాధించాడు. ఇప్పుడు మెగా 151ని కూడా తానే నిర్మించబోతున్నాడు రామ్ చరణ్. తొలి తొరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని సినిమాగా రూపొందించనుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ బడ్జెట్.. ఇప్పుడు అమాంతం పెరిగిపోయిందట. ఇలా పెరిగిపోవడానికి కారణం.. బాహుబలి2 కావడమే అసలైన విషయం.బాహుబలి2 చూసిన తర్వాత.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని చెర్రీ డిసైడ్ అయ్యాడట.
అందుకే మొదట 80 కోట్లు అనుకున్న బడ్జెట్ ను ఇప్పుడు ఏకంగా 125 కోట్ల రూపాయలకు చేర్చాడని.. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావద్దని.. దర్శకుడికి చెప్పాడట. పీరియాడిక్ మూవీ కావడంతో ఉయ్యాలవాడకు భారీగానే విజువల్ ఎఫెక్ట్స్ అవసరమవుతాయి. హై స్టాండర్డ్స్ తో ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినా.. అంతకు అంత రాబట్టుకోవచ్చని ప్రూవ్ చేసిన బాహుబలి.. ప్రొడ్యూసర్ చెర్రీని మార్చేసిందని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/