Begin typing your search above and press return to search.
చరణ్ నిర్ణయం.. సుక్కుకు ఉపశమనం
By: Tupaki Desk | 7 Nov 2017 7:22 AM GMTరెండేళ్ల కిందట వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ విషయంలో సుకుమార్ అనుభవించిన టెన్షన్ అంతా ఇంతా కాదు. మామూలుగా సుకుమార్ చాలా తాపీగా పని చేస్తుంటాడు. నెమ్మదిగా షూటింగ్ చేస్తుంటాడని.. హడావుడి పడడని.. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడడని అతడికి పని ఉంది. ‘నాన్నకు ప్రేమతో’ విషయంలో మాత్రం సుక్కు కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2016 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే కండిషన్ పెట్టడంతో సుకుమార్ రేయింబవళ్లు పని చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ఈ విషయం ‘నాన్నకు ప్రేమతో’ చూస్తున్నపుడు కూడా అక్కడక్కడా తెలిసిపోతుంది.
ఐతే ‘రంగస్థలం’ విషయంలోనూ ఓ దశలో సుకుమార్ ఇలాగే కొంచెం రాజీ పడాల్సిన అవసరం వచ్చింది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటే.. సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’కు కష్టపడ్డట్లే దీనికి శ్రమించాల్సి వచ్చేది. దీని వల్ల హడావుడి అయి.. క్వాలిటీ కొంచెం తేడా వచ్చేది. ఐతే సంక్రాంతికి ‘అజ్నాతవాసి’ కన్ఫమ్ కాగానే.. బాబాయికి పోటీగా వెళ్లేది లేదని.. ఈ విషయంలో సంప్రదింపులు కూడా వద్దని... సినిమాను వాయిదా వేయాల్సిందే అని రామ్ చరణ్ పట్టుబట్టాడట. మరోవైపు పవన్ కళ్యాణ్ తో ‘మైత్రీ మూవీ మేకర్స్’ వాళ్లకు కూడా ఓ కమిట్మెంట్ ఉండటంతో వాళ్లు మారు మాట్లాడకుండా వేసవికి ‘రంగస్థలం’ సినిమాను వాయిదా వేసేశారు. దీంతో సుకుమార్ ఊపిరి పీల్చుకున్నాడట. హడావుడి లేకుండా ప్రశాంతంగా.. తాను కోరుకున్న రీతిలో సినిమా తీసుకునే వెసులుబాటు అతడికి దక్కింది. దీంతో క్వాలిటీ విషయంలో ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటున్నాడట సుక్కు. మరి ఔట్ పుట్ ఎలా వస్తుందో చూద్దాం.