Begin typing your search above and press return to search.

అనినీతి లేనిది ఇండస్ట్రీలోనే -చరణ్

By:  Tupaki Desk   |   30 April 2018 4:21 AM GMT
అనినీతి లేనిది ఇండస్ట్రీలోనే -చరణ్
X
ఇందుగలడు.. అందులేడని సందేహం వలదు అన్నట్లుగా ఈ రోజు సొసైటీలో కరెప్షన్ లేని చోటు లేకుండా పోయింది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు ఎంతో అవినీతిని కళ్లారా చూస్తూ ఉన్నా ఏమీ చేయలేక పోతున్నసమాజం మనది. చివరకు కొన్ని రంగాల్లో కరెప్షన్ మామూలు అనుకునే పరిస్థితులకు వచ్చేశాం. ప్రపంచం కరెప్షన్ లేని ఏకైక రంగం సినిమా ఇండస్ట్రీనే అంటున్నాడు రామ్ చరణ్.

స్టయిలిష్ట స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ ఇండస్ట్రీలో అవినీతి లేదని క్లారిటీగా చెప్పాడు. ‘‘సినిమా వాళ్లమంతా ఉదయం ఐదింటికి లేస్తాం. జిమ్ చేసి తరవాత మేకప్ వేసుకుని షూటింగ్ స్పాట్ కు వెళతాం. రాత్రి వరకు అక్కడే పనిచేస్తాం. ప్రేక్షకులను మెప్పించేందుకు ఎన్నో రిస్కీ షాట్స్ చేస్తాం. దానిమూలంగా ఎన్నోసార్లు గాయపడుతుంటాం. బన్నీ ఎన్నిసార్లు గాయపడ్డాడో నాకు తెలుసు. ప్రభాస్ కు రెండుసార్లు భుజానికి సర్జరీ అయింది. బాలకృష్ణ.. మా డాడీ చిరు కూడా గాయపడ్డారు. ఒళ్లు హూనం చేసుకుని రేపు ఏం చేయాలి అని ఆలోచిస్తాం. ఈ ప్రాసెస్ లో కరెప్షన్ ఎక్కడుంది.’’అంటూ రామ్ చరణ్ సూటిగా క్వశ్వన్ చేాడు.

చరణ్ చెప్పేదానిలో కొంత వరకు నిజం లేకపోలేదు. ప్రేక్షకులను మెప్పించడానికి మన హీరోలు పడే కష్టాన్ని ఎవ్వరూ తప్పుపట్టలేరు. కానీ కరెప్షన్ మూలాలు అన్నీ షూటింగ్ స్పాట్ లో ఉండవు. ఇండస్ట్రీలో ఖర్చులు బాగానే చూపించినా సినిమా రిలీజయ్యాక వచ్చే ఆదాయం లెక్కల విషయంలో చాలా తేడాలే ఉంటాయి. లెక్కలకు దొరకని డబ్బు పోగుపడేదిక్కడే. చరణ్.. ఈ పాయింట్ మిస్పయినట్టు లేడూ..