Begin typing your search above and press return to search.
15 కోట్లు కావాలంటున్న రామ్ చరణ్?
By: Tupaki Desk | 28 Aug 2016 6:11 AM GMTమొన్ననే మోషన్ పోస్టర్ రిలీజ్ కావడంతో అప్పుడే ''ఖైదీ నెం 150'' బిజినెస్ పనులు కూడా మొదలెట్టేశారు. అయితే లోకల్ బిజినెస్ ఇప్పటికే చాలామంది మెగా సన్నిహితులు కొన్ని మెయిన్ జిల్లాలను పంచేసుకోగా.. తక్కిన జిల్లాల్లో మాత్రం భారీ రేట్లకే అమ్మాలని చూస్తున్నారు. ఇదంతా అలా ఉంటే ఓవర్సీస్ మాత్రం ఈ ఖైదీ బయటకు రావాలంటే బాగా మాంచి ధర పే చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాడట ప్రొడ్యూసర్ చరణ్.
ట్రేడ్ సర్క్యూట్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఇప్పటివరకు చరణ్ ఈ సినిమాకు 15 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అమెరికా మార్కెట్లో హైప్ కారణంగా అత్యధిక కలక్షన్లు సాధించిన సినిమా ఏదైనా ఉందా అంటే అది 'కబాలి' అనే చెప్పాలి. నాలుగు మిలియన్ డాలర్ల కలక్షన్ వచ్చింది. అందుకే చరణ్ కూడా ఈ రేంజులో డిమాండ్ చేస్తున్నాడని టాక్. అయితే 15 కోట్లు రికవర్ అవ్వాలంటే మాత్రం.. సినిమా మినిమం 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. (రూ. 22 కోట్ల షుమారు గ్రాస్). చిరంజీవి అంత తెస్తారా మరి?
ఇప్పటివరకు బాహుబలి సినిమాకు తప్పిస్తే.. ఇతర సినిమాల అంత ఫిగర్ ను టచ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. మహేష్ బాబు కూడా ఊపులో శ్రీమంతుడుతో కొట్టాడే కాని.. తరువాత తను కూడా అంత భారీ స్థాయిలో కలక్షన్ తేలేకపోయాడు. మరి ఇప్పుడు చిరంజీవి ఆ ఫీట్ చేయగలరా? అందుకే పంపిణీదారులు చరణ్ అడిగి ఎమౌంట్ పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది.