Begin typing your search above and press return to search.
చరణ్ సత్తా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది
By: Tupaki Desk | 13 Dec 2016 12:00 PM GMTఅటు అమెరికాలో ప్రిమియర్ షోల వసూళ్లు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు వసూళ్లు కొంచెం కంగారు పెట్టినా.. ఆ తర్వాత ‘ధృవ’ అంచనాల్ని మించే పెర్ఫామ్ చేసింది. అమెరికాలో శుక్ర.. శని వారాల్లో ఊహించని స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా శనివారం అయితే అమెరికాలో ఏకంగా మూడున్నర లక్షల డాలర్లు కొల్లగొట్టేసింది ‘ధృవ’. ఇటు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ అంతా వసూళ్ల వర్షం కురిపించిందీ సినిమా. సోమవారం కూడా సెలవు రోజే కావడం ‘ధృవ’కు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే ‘ధృవ’ వరల్డ్ వైడ్ షేర్ రూ.35 కోట్లకు చేరువగా ఉంది. ఐతే ఇప్పటిదాకా జోరు ఎలా ఉన్నా.. మంగళవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందన్నది కీలకం.
డీమానిటైజేషన్ దెబ్బను తట్టుకుని.. ఆరంభ వసూళ్లలో ‘ధృవ’ అంచనాల్ని మించే పెర్ఫామ్ చేసింది ‘ధృవ’. ఐతే ఇప్పటికీ ఈ చిత్రం ఎక్కడా బ్రేక్ ఈవెన్ కు రాలేదు. అందుకోసం ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది. అమెరికాలో చరణ్ కు తొలి మిలియన్ క్లబ్ మూవీగా రికార్డు సృష్టించిన ‘ధృవ’ ఇంకా అక్కడ హాఫ్ మిలియన్ దాకా కలెక్ట్ చేస్తేనే బయ్యర్ కు లాభాలు అందిస్తుంది. తెలుగు రాష్ట్రాలు మిగతా ఏరియాల్లో కలిపి ఈ చిత్రం ఇంకా రూ.20 కోట్ల దాకా వసూలు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేసే అల్లు అరవింద్ ‘సింగం-3’ సినిమాను 16 నుంచి 23కు వాయిదా వేయించాడు. ఆ చిత్రం యధావిధిగా రిలీజ్ చేసి ఉంటే ‘ధృవ’కు పంచ్ పడేది. ఈ వారాంతంలో చిన్న సినిమాలే రిలీజవుతుండటం ‘ధృవ’కు కలిసొచ్చే అంశం. ‘ధృవ’ వసూళ్లు ఎ సెంటర్లలో బాగున్నాయి కానీ.. బి-సిల్లోనే ఆశించిన స్థాయిలో లేవు. వీకెండ్.. సెలవు ముగిసిన నేపథ్యంలో మాస్ లో తన సత్తా ఏంటో రామ్ చరణ్ ఇప్పుడు చూపించాల్సి ఉంటుంది. ఆ ఏరియాల్లో వసూళ్లు స్టడీగా ఉంటేనే సినిమా లాభాల బాట పడుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/