Begin typing your search above and press return to search.

ధృవ ఫస్ట్ లుక్.. కౌంట్ డౌన్ స్టార్ట్

By:  Tupaki Desk   |   10 Aug 2016 6:52 PM GMT
ధృవ ఫస్ట్ లుక్.. కౌంట్ డౌన్ స్టార్ట్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న మూవీ ధృవ. ఈ సినిమా కోసం చెర్రీ చాలానే కష్టాలు పడుతున్నాడు. ముఖ్యంగా ధృవలో అథ్లెటిక్ లుక్ కోసం తనకెంతో ఇష్టమైన నాన్ వెజ్ ఫుడ్ కి కూడా నెలల నుంచి దూరంగా ఉంటున్నాడు. డిఫరెంట్ గా కట్ చేసిన మీసకట్టు చెర్రీకి భలేగా నప్పేసింది. అసలు సినిమాలో తమ అభిమాన హీరో ఎలా ఉంటాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఆగస్ట్ 15న ధృవ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవ్వబోతున్నట్లు యూనిట్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే ఇంకో ఐదు రోజుల్లో ధృవలో చెర్రీ ఎలా ఉంటాడో తెలిసిపోతుందన్న మాట. రామ్ చరణ్ మూవీకి ఫస్ట్ లుక్ అంటే.. చెర్రీ గెటప్ చూపించాల్సిందే. అంటే మూవీలో చెర్రీ లుక్ ఆగస్ట్ 15న రివీల్ కానుంది ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు అభిమానుల్లో నెలకొన్న డౌట్ ఏంటంటే.. ఈ ఫస్ట్ లుక్ లో చరణ్ పోలీస్ గెటప్ లో చూపిస్తారా.. లేక జస్ట్ గెటప్ ఇచ్చి వదిలేస్తారో అర్ధం కావడం లేదు.

లుక్స్ విషయంలోనే ఇంతగా క్వశ్చన్స్ హైప్ పెరగడానికి అసలు కారణం ఏంటంటే.. ముంబైకి చెందిన ఓ పీఆర్ ఏజన్సీ.. ధృవ కోసం స్పెషల్ గా వర్క్ చేస్తోంది. అందుకే గతంలో ఎప్పుడూ కనిపించని స్థాయిలో.. స్పాట్ నుంచి ఫోటోస్ వీడియోస్.. ఎయిర్ పోర్ట్ ఫోటోస్ బయటకొస్తున్నాయ్. ఇప్పుడు ఫస్ట్ లుక్ నుంచి ఈ పీఆర్ ఏజన్సీ తన ప్రతాపం చూపించబోతోందట. ఫస్ట్ లుక్ తో మొదలుపెట్టి రిలీజ్ వరకూ.. ఈ ఫీవర్ ని పెంచుతూనే ఉండేలా ప్లాన్ చేశారట. అంటే దసరా వచ్చేనాటికి మొత్తమంతా చరణ్ హంగామానే ఉంటుందని అర్ధం కావడం లేదూ!