Begin typing your search above and press return to search.
ఈ వానల్లో ధృవ సంగతేంటి?
By: Tupaki Desk | 3 Aug 2016 5:50 AM GMTగత కొన్ని రోజులుగా హైద్రాబాద్ లో విపరీతంగా వానలు కురుస్తున్నాయి. ఎప్పుడు కురుస్తుందో.. ఎప్పుడు ఆగుతుందో కూడా తెలీడం లేదు. ఈ వానల కారణంగా రామ్ చరణ్ మూవీ ధృవకి విపరీతంగా ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ సినిమాని మరో రెండు నెలల్లో రిలీజ్ చేయాల్సి ఉండగా.. వర్షాలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. షూటింగ్ వేగం అందుకుని రెండు నెలలు మాత్రమే గడవగా.. మరో 2 నెలలు షార్ట్ టెర్మ్ మాత్రమే ధృవ యూనిట్ దగ్గరుంది.
భారీ వర్షాలు ఎంతగా ధృవ టీమ్ ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయంటే.. టెక్నీషియన్స్ షూటింగ్ స్పాట్ కు రావడం కూడా కష్టమైపోతోంది. సెట్స్ తడిసి ముద్దయిపోతున్నాయి.. ఓపెన్ ఎయిర్ లో షూటింగ్ కి మహా ఇబ్బంది అయిపోతోంది. అయినా సరే ధృవ మాత్రం స్పీడ్ తగ్గించడం లేదని తెలుస్తోంది. లైటింగ్ తక్కువైతే హెవీ ఫోకస్ లైట్స్ తెప్పించి మరీ షూట్ చేస్తున్నారు. ఇక కొన్ని సీన్స్ ని అయితే.. రెయిన్ ఎఫెక్ట్ కింద మార్చేసి మరీ షూటింగ్ చేసేస్తున్నారట.
అనుకున్న రిలీజ్ డేట్ అక్టోబర్ 6కి సినిమాని థియేటర్లలోకి తెచ్చేందుకు ఎన్ని ఇబ్బందులనైనా ఓవర్ కమ్ చేసేస్తోంది ధృవ యూనిట్. ముఖ్యంగా చెర్రీ చూపిస్తున్న ఎనర్జీ లెవెల్స్ ని చూసి.. యూనిట్ అంతటికీ హుషారు వచ్చేస్తోందని అంటున్నారు. చరణ్ తలుచుకుంటే వర్షాలు ఆపుతాయా ఏంటి? వరుణ దేవుడినిగా మగధీరుడు ఎదిరించేసి మరీ ధృవని ఫినిష్ చేసేస్తున్నాడని టాక్.